Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: భారత్ X ఇంగ్లండ్ సెమీఫైనల్ రద్దయితే..?

T20 World Cup 2022: What will happen if rain wash out India vs England semi final Match

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 తుది దశకు చేరుకుంది. మరో మూడు మ్యాచ్‌లతో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడనుండగా.. గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సెమీఫైనల్లో నెగ్గిన జట్లు ఆదివారం టైటిల్ ఫైట్‌లో తలపడనున్నాయి. ఇక ఈ మెగా టోర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగినా.. వర్షం అంతరాయం మాత్రం కలిగించింది. మొత్తం నాలుగు మ్యాచ్‌లను మింగేసింది. మరో మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది.

వర్షంతో రద్దయితే..

వర్షంతో రద్దయితే..

ప్రస్తుతం వర్షం వచ్చే సూచనలు లేకున్నా.. సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్‌డే కేటాయించారు. ఇక రిజర్వ్‌డే కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే పరిస్థితి ఏందనే సందేహం చాలామంది మదిలో మెదులుతోంది. సాధారణ మ్యాచ్‌ల్లో ఐదు ఓవర్ల పాటు ఆట కొనసాగినా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేలుస్తారు. అయితే ఫైనల్లో మాత్రం కచ్చితంగా 10 ఓవర్ల ఆట కొనసాగాలి.

మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇరు జట్ల కెప్టెన్లు ఈ నిర్ణయం తీసుకుంటారు. సెమీ ఫైనల్ సందర్భంగా ప్రతికూల పరిస్థితుల్లో మ్యాచ్ రోజుతో పాటు రిజర్వ్ డే కూడా 10 ఓవర్ల ఆట కొనసాగకపోతే.. పాయింట్స్ టేబుల్‌లో మెరుగ్గా ఉన్న జట్టు ఫైనల్ చేరుతోంది.

అలా జరిగితే ఫైనల్‌కు భారత్

అలా జరిగితే ఫైనల్‌కు భారత్

ఈ లెక్కన తొలి సెమీఫైనల్‌కు ఇదే పరిస్థితి వస్తే.. పాకిస్థాన్‌ను కాదని న్యూజిలాండ్ ఫైనల్ చేరనుండగా.. రెండో సెమీఫైనల్లో భారత్‌ టైటిల్ ఫైట్‌కు సిద్దమవుతోంది. ఒకవేళ ఫైనల్లోనే ఈ పరిస్థితి తలెత్తి 10 ఓవర్ల ఆట కూడా కొనసాగకపోతే.. టైటిల్ ఇరు జట్లు షేర్ చేసుకుంటాయి. అక్కడి వెదర్ రిపోర్ట్ ప్రకారం సెమీఫైనల్స్ జరిగే అడిలైడ్‌తో పాటు సిడ్నీలో వర్షాలు వచ్చే అవకాశం అయితే లేదు.

కానీ ఆస్ట్రేలియా వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ వర్షం వచ్చినా మైదానాన్ని త్వరగా సిద్దం చేసే అత్యున్నత పరికరాలు, టెక్నాలజీ ఆస్ట్రేలియా గ్రౌండ్లకు ఉంది. కాబట్టి మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు.

ముమ్మరంగా ప్రాక్టీస్..

ఇక సెమీ ఫైనల్ కోసం భారత జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. ఇప్పటికే అడిలైడ్ చేరుకున్న రోహిత్ సేన.. ఇంగ్లండ్ జట్టుకు తగ్గట్లు సన్నదమవుతోంది. ముఖ్యంగా ఇంగ్లండ్ పేస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు బ్యాటర్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, పంత్ ముమ్మరంగా సాధన చేశారు. నెట్స్‌లో రోహిత్ గాయపడటం భారత శిభిరంలో ఆందోళన రేకెత్తించింది. అయితే రోహిత్‌కు అయింది చిన్న గాయమే అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Story first published: Tuesday, November 8, 2022, 14:46 [IST]
Other articles published on Nov 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+