T20 World Cup 2022: జట్ల సెమీస్ అవకాశాలను తలకిందులు చేసే నెట్‌రన్ రేట్ ఎలా లెక్కిస్తారంటే?

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 తుది దశకు చేరింది. సూపర్ 12లో ఇంకా నాలుగు మ్యాచ్‌లే మిగిలున్నాయి. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖారారు చేసుకోగా.. సెకండ్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. శనివారం జరిగే ఇంగ్లండ్-శ్రీలంక మ్యాచ్‌తో గ్రూప్-1 నుంచి సెమీస్ చేరే రెండో జట్టు ఏదో తేలనుంది. ఇక గ్రూప్-2లో రెండు సెమీస్ బెర్త్‌ల కోసం భారత్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు పోటీపడుతున్నాయి.
ఆదివారం జరిగే ట్రిపుల్ హెడర్స్ మ్యాచ్‌లతో ఈ గ్రూప్ నుంచి సెమీస్ చేరే జట్టు ఏదో తేలనుంది. అయితే రెండు గ్రూప్స్‌లోనూ జట్ల భవితవ్యం ఇప్పుడు నెట్‌రనేట్‌పై ఆధారపడి ఉంది. ఈ టోర్నే కాదు.. ఐపీఎల్, బీబీఎల్ ఇలా ఏ క్రికెట్ టోర్నీ తీసుకున్నా.. జట్ల టైటిల్ అవకాశాలను నెట్‌రన్‌రేట్ శాసిస్తోంది. ఈ క్రమంలోనే అసలు క్రికెట్‌లో నెట్‌రన్‌రేట్ అంటే ఏంటి? దీన్ని ఎలా లెక్కిస్తారో అనే విషయం గురించి తెలుసుకుందాం.

నెట్‌రన్ రేట్ ఫార్మూలా..
నెట్ రన్ రేట్ = (టోర్నీలో చేసిన మొత్తం రన్స్/టోర్నీలో ఆడిన మొత్తం ఓవర్లు) - (అదే టోర్నీలో మొత్తం ఇచ్చుకున్న రన్స్/టోర్నీలో ప్రత్యర్థులు ఆడిన ఓవర్లు)

ఎలా లెక్కిస్తారంటే..?
ఒక జట్టు ఏదైనా టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడితే అందులో మొత్తం మ్యాచ్‌ల్లో కలిపి ఎన్ని పరుగులు చేసిందో.. దానికి ఎన్ని ఓవర్ల బంతులు ఎదుర్కుందో లెక్కిస్తారు. చివరికి మొత్తం పరుగుల్ని ఎదుర్కొన్న ఓవర్లతో విభజించి సగటు పరుగుల్ని లెక్కిస్తారు. ఆ వచ్చిన మొత్తాన్ని రన్స్ పర్ ఓవర్‌గా నిర్ణయిస్తారు. అలాగే అదే జట్టుపై ఇతర జట్లు ఎన్ని పరుగులు చేస్తాయో.. ఆ జట్టు ఎన్ని ఓవర్లను ఎదుర్కొంటాయో లెక్కిస్తారు. ఒకవేళ ప్రత్యర్థి జట్టు ఆ మ్యాచ్‌లో నిర్దేశించిన ఓవర్ల కన్నా తక్కువ ఓవర్లకే ఆలౌటైతే అప్పుడు కూడా వాటిని పూర్తి ఓవర్ల కోటా కింద లెక్కిస్తారు. చేజింగ్‌లో ముందే లక్ష్యాన్ని అందుకుంటే అన్ని ఓవర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇలా వచ్చిన సగటును జట్టు సగటు నుంచి తీసివేస్తే వచ్చేదే నెట్‌రన్‌రేట్.

ఉదహారణకు..
ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడింది. పాకిస్థాన్‌తో 20 ఓవర్లలో 160 పరుగులు.. నెదర్లాండ్స్‌తో 20 ఓవర్లలో 179, సౌతాఫ్రికాతో 20 ఓవర్లలో 133 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌తో 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. ఇలా నాలుగు మ్యాచ్‌ల్లో 80 ఓవర్లలో 656 పరుగులు చేసింది. ఓవర్‌కు సగటున 8.2 పరుగులు చేసింది.
ఇక పాకిస్థాన్‌కు 20 ఓవర్లలో 159, నెదర్లాండ్స్‌తో 20 ఓవర్లలో 123, సౌతాఫ్రికాకు 19.4 ఓవర్లలో 137 పరుగులు, బంగ్లాదేశ్ 16 ఓవర్లలో 145 పరుగులిచ్చుకుంది. ఓవరాల్‌గా 75.4 ఓవర్లలో 564 పరుగులిచ్చింది. సగటున ఓవర్‌కు 7.4801 పరుగులిచ్చింది. ఈ సగటును 8.2 నుంచి తీసేస్తే వచ్చేదే నెట్‌రన్ రేట్. భారత్ నెట్ రన్‌రేట్ ప్రస్తుతం 0.730గా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications