Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: విరాట్ కోహ్లీకే ఆ అవార్డు.. కెరీర్‌లోనే తొలిసారి!

T20 World Cup 2022: Virat Kohli won the ICC Mens player of the month for October

దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు. క్రికెట్ మైదానంలో పరుగులు రారాజుగా ఎన్నో ఘనతలను అందుకున్న విరాట్.. తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. గతేడాది జనవరిలో ఐసీసీ ఈ అవార్డు ప్రవేశపెట్టగా.. విరాట్‌కు ఫస్ట్ టైమ్ ఈ అవార్డు వరించింది. అక్టోబర్ నెలలో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజాలను ఐసీసీ ఈ అవార్డు కోసం నామినేట్ చేసింది. కానీ అభిమానులు మాత్రం విరాట్‌కే ఈ అవార్డును కట్టబెట్టారు.

కోహ్లీ అచ్చొచ్చిన అక్టోబర్..

ఆసియా కప్‌లో రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో చెలరేగిన కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రపంచకప్ ప్రారంభమైన అక్టోబరు నెలలో కోహ్లీ రెండు అర్ధ సెంచరీలతో 205 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 82 పరుగులు చేసి తానేంటో మరోమారు క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు చేశాడు.

మిల్లర్.. కిల్లర్‌తో పోటీ..

మిల్లర్.. కిల్లర్‌తో పోటీ..

మరోవైపు, పెర్త్‌తో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చిన డేవిడ్ మిల్లర్.. ఈ అవార్డు కోసం కోహ్లీతో పోటీపడ్డాడు. భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌తో అక్టోబర్ నెలను ప్రారంభించిన మిల్లర్ మూడు వన్డేల్లో 117 పరుగులు చేశాడు. రెండు టీ20ల్లో 125 పరుగులు చేసిన మిల్లర్.. గువాహటిలో 79 బంతుల్లో 106 (నాటౌట్) అజేయ సెంచరీతో రాణించాడు. ఇక జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా కూడా ప్లేయర్ ఆఫ్ ద మంత్‌కు నామినేట్ అయ్యాడు. సూపర్-12 రౌండ్-1లో పాకిస్థాన్‌ను మట్టికరిపించడంలో రజా కీలక పాత్ర పోషించాడు.

జింబాబ్వే రజా...

జింబాబ్వే రజా...

కాగా, ఆగస్టులోనూ ఈ అవార్డు రజాకే దక్కడం గమనార్హం. రజా ఆరు టీ20ల్లో 145 పరుగులు చేయడంతోపాటు 9 వికెట్లు నేలకూల్చాడు. రజా మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఐర్లాండ్‌పై 82 (నాటౌట్) పరుగులు చేయగా, పాకిస్థాన్‌పై 25 పరుగులిచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. కానీ అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీకే ఓటేయడంతో ఐసీసీ అతనికే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కట్టబెట్టింది.

ఓటింగ్ ద్వారా విజేత..

ఓటింగ్ ద్వారా విజేత..

మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు సంబంధించిన సభ్యులు ఉంటారు.

Story first published: Monday, November 7, 2022, 14:28 [IST]
Other articles published on Nov 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+