Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: రంగంలోకి దిగిన విరాట్ కోహ్లీ.. నెట్స్‌లో కేఎల్ రాహుల్‌కు పాఠాలు! (వీడియో)

 T20 World Cup 2022: Virat Kohli turns coach for Struggling India opener KL Rahul

అడిలైడ్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోచ్ అవతారమెత్తాడు. నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న కేఎల్ రాహుల్‌ ప్రాక్టీస్ సెషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించాడు. ఫామ్‌ అందుకునేందుకు నెట్స్‌‌లో అతనికి పాఠాలు బోధించాడు. గత మూడు మ్యాచ్‌ల్లో రాహుల్(4, 9, 9) దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వైస్ కెప్టెన్సీ హోదా అతన్ని కాపాడుతుండగా.. హర్భజన్ సింగ్ వంటి మాజీ ఆటగాళ్లు ఫామ్‌లో లేని ప్లేయర్లను పక్కనపెట్టాల్సిందేనని సూచించారు.

ఫామ్‌లోకి వచ్చేందుకు పాఠాలు..

టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై విజయం సాధించిన భారత్.. సౌతాఫ్రికాతో ఓటమిపాలైంది. బుధవారం జరగనున్న తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాలి. టోర్నీలో ముందడుగు వేయాలంటే.. ఓపెనర్లు రాణించడం ముఖ్యం. కేఎల్ రాహుల్ ఫామ్‌లో రావడం జట్టుకు అత్యవసరం. ఈ క్రమంలోనే ఇలాంటి విషమ దశ ధాటిన అనుభవం ఉన్న విరాట్.. రాహుల్‌కు పాఠాలు చెప్పాడు.

అనుభవంతో మెళకువలు..

అనుభవంతో మెళకువలు..

మంగళవారం అడిలైడ్‌ వేదికగా జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో రాహుల్‌తో చాలా సేపు మాట్లాడిన విరాట్.. బ్యాటింగ్ మెళకువలు చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఔట్‌ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను ఎలా ఆడాలనే విషయాన్ని విరాట్ రాహుల్‌కు చెప్పాడు. గతంలో విరాట్ సైతం ఇదే తరహా బంతులకు ఔటై.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎట్టకేలకు ఆ సమస్య నుంచి బయటపడి ఫామ్‌లోకి వచ్చిన అతను ఆ అనుభవంతోనే రాహుల్‌కు అడ్వైజ్ ఇచ్చాడు.

అండగా టీమ్‌మేనేజ్‌మెంట్..

అండగా టీమ్‌మేనేజ్‌మెంట్..

వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా రాహుల్‌కు టీమ్‌మేనేజ్‌ అండగా నిలిచింది. కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోస్ విక్రమ్ రాథోడ్ సైతం అతన్ని వెనకేసుకొచ్చారు. 'కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు. అతని గత రికార్డులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. టీ20ల్లో విఫలమవ్వడం సహజమే. ఈ ఫార్మాట్‌లో టాపార్డర్స్ బ్యాటర్లు రాణించడం అంత సులువు కాదు. ఈ టోర్నీ సవాల్‌తో కూడుకున్నది. ప్రాక్టీస్ గేమ్‌లో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి పేసర్లను రాహుల్ అద్భుతంగా ఆడాడు. 60, 70 పరుగులు చేశాడు. తదుపరి మ్యాచ్‌ల్లో అతను రాణిస్తాడని ఆశిస్తున్నా'అని ద్రవిడ్ తాజాగా వెల్లడించాడు.

Story first published: Tuesday, November 1, 2022, 16:34 [IST]
Other articles published on Nov 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+