Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూర్యతో బ్యాటింగ్ భలే ఉంటుంది.. నువ్వుండన్నా.. నేను చూసుకుంటా అంటాడు: కోహ్లీ

 T20 World Cup 2022: Virat Kohli says I play a different role when Im out there with Suryakumar Yadav

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్‌తో బ్యాటింగ్ భలే ఉంటుందని చెప్పాడు. 'క్రీజులో నువ్వుండన్నా.. నేను చెలరేగుతాను'అని చెబుతాడని దాంతో తాను యాంకర్ రోల్ పోషించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌తో టీమిండియా తమ ప్రపంచకప్ వేటను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది.

సూర్య‌తో బ్యాటింగ్ ఆస్వాదిస్తా..

సూర్య‌తో బ్యాటింగ్ ఆస్వాదిస్తా..

ఈ బిగ్ మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ కోహ్లీ ఇంటర్వ్యూను విడుదల చేసింది. ఈ వీడియో విరాట్.. సూర్య గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. 'సూర్యతో కలిసి బ్యాటింగ్‌ చేయడం చాలా సరదాగా అనిపిస్తుంది. అరుదైన నైపుణ్యం, సామర్థ్యంతో అతడు అలరిస్తాడు. క్రీజులోకి రాగానే బంతి వికెట్ల మీదకు ఎలా వస్తుందని అడుగుతాడు. ఆ తర్వాత 2-3 బంతులు ఆడి పిచ్‌పై ఓ అంచనాకు వస్తాడు. ఆ తర్వాత బాదుడు మొదలుపెడతాడు. మేమిద్దరం ఎప్పుడు భాగస్వామ్యం నెలకొల్పినా, ఎదురుదాడి తానే చేస్తానని అంటాడు.

అండగా ఉండన్నా అంటాడు

అండగా ఉండన్నా అంటాడు

..

నువ్వు అండగా ఉంటే చాలని చెప్తాడు. అందుకే సూర్య క్రీజులో ఉన్నప్పుడు నా పాత్ర భిన్నంగా ఉంటుంది. అతనితో బ్యాటింగ్‌ను నేను ఆస్వాదిస్తాను కూడా.జట్టుకు మంచే జరుగుతుంది'' అని విరాట్‌ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తాజాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో కోహ్లీ-సూర్య మెరుపు భాగస్వామ్యాలు నెలకొల్పారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగిన సిరీస్‌ నిర్ణాయక టీ20లో ఈ జోడీ కేవలం 10.2 ఓవర్లలోనే 104 పరుగులు రాబట్టింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లోనూ సూర్య-విరాట్‌ జోడీ రాణించడం భారత్‌కు కీలకం.

ధోనీ మద్దతుకు రుణపడి ఉన్నా..

ధోనీ మద్దతుకు రుణపడి ఉన్నా..

కెరీర్ ఆరంభంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన మద్దతు మరవలేనిదని, అతని ప్రోత్సహం కారణంగానే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని విరాట్ తెలిపాడు. ఎప్పటికీ తాను ధోనీకి రుణపడి ఉంటానని చెప్పాడు. 'ధోనీతో ఉన్న స్నేహం, బంధం గురించి వివరించడం చాలా కష్టం. ఎందుకంటే అతను నన్ను అర్ధం చేసుకున్న విధానం, నాపై ఉంచిన నమ్మకం అలాంటిది. మేం ఇద్దరం బ్యాటింగ్ చేసేటప్పుడు ఒకరికొకరం చెప్పుకోకుండా పరుగులు తీసేవాళ్లం. 10-12 ఏళ్లు మేం ఇద్దరం కలిసి ఆడగా ఒకటి, రెండుసార్లు మా మధ్య అపార్థాలు చోటు చేసుకున్నాయే కానీ.. ఎప్పూడూ ఇద్దరం గేమ్‌పై ఫోకస్‌గా ఉండేవాళ్లం. అదే నమ్మకం, విశ్వాసం, స్నేహం మైదానం బయట కూడా కొనసాగుతోంది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, October 23, 2022, 10:50 [IST]
Other articles published on Oct 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+