Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కష్టకాలంలో నన్ను ఆదుకున్నది అతనే: విరాట్ కోహ్లీ

T20 World Cup 2022: Virat Kohli Reveals What MS Dhoni Texted Him During Lean Patch

అడిలైడ్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సాయాన్ని గుర్తు చేసుకున్నాడు. తాను తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీనే ఆదుకున్నాడని తెలిపాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న సమయంలో ధోనీ పంపించిన సందేశం తనకు ఎంతగానో ఉపయోగపడిందన్నాడు. ఆసియా కప్ 2022 ముందు వరకు విరాట్ కోహ్లీ నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.

మూడేళ్లుగా సెంచరీ కోసం నిరీక్షించిన కోహ్లీ.. కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నాడు. అయితే ఆసియాకప్ 2022 ముందు నెల రోజుల పాటు విరామం తీసుకున్న అతను రీఎంట్రీలో దుమ్మురేపాడు. సెంచరీతో ఫామ్ అందుకొని పాత కోహ్లీని తలపించాడు.

ధోనీ ఒక్కడే..

ధోనీ ఒక్కడే..

టీ20 ప్రపంచకప్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్నందించాడు. క్రికెట్ చరిత్రలోనే విరాట్ ఆడిన ఈ ఇన్నింగ్స్ చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక టోర్నీ ఆసాంతం అదే జోరును కనబరుస్తున్న అతను అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అయితే తాను ఫామ్ లేమితో తంటాలు పడుతున్నప్పుడు అండగా నిలిచిన వారు ఎవరూ లేరని, ఒక్క ధోనీ మాత్రం తనకు ధైర్యం చెప్పాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తాజాగా విడుదల చేసిన పోడ్‌కాస్ట్‌లో కోహ్లీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ధోనీతో స్నేహం.. ఓ దీవేన..

ధోనీతో స్నేహం.. ఓ దీవేన..

తాను ఫామ్ లో లేని సమయంలో ధోనీ నుంచి వచ్చిన మెసేజ్ ఎంతో విలువైనదని వివరించాడు. ధోనీ వంటి సీనియర్ ఆటగాడితో పరస్పర గౌరవంతో కూడిన స్నేహ బంధం కలిగివుండటం ఓ దీవెనగా భావిస్తానని పేర్కొన్నాడు. 'ధోనీ పంపిన సందేశంలో ఓ అంశం నన్ను బలంగా తాకింది. నువ్వు ఆత్మవిశ్వాసంతో నిలబడినప్పుడు, దృఢమైన వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు... నువ్వు ఎలా ఆడుతున్నావు అన్న విషయాన్ని అడగడం ప్రజలు మర్చిపోతారని ధోనీ పేర్కొన్నాడు.

ఆ విషయం అర్థమైంది..

ఆ విషయం అర్థమైంది..

నా పరిస్థితికి ఇది సరిగ్గా సరిపోతుందనిపించింది. ప్రజలు నన్నెప్పుడూ కూడా ఆత్మవిశ్వాసం కూడిన వ్యక్తిగా, మానసికంగా బలమైన వ్యక్తిలా, ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలిగిన వ్యక్తిలా చూసేవారు. అయితే, జీవితంలోని కొన్ని సమయాల్లో రెండడుగులు వెనక్కి వేసి మనల్ని మనం సమీక్షించుకోవాలన్న విషయం అర్థం చేసుకున్నాను'అని వివరించాడు.

Story first published: Monday, November 7, 2022, 19:40 [IST]
Other articles published on Nov 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+