ఆసీస్ గడ్డపై నా సక్సెస్‌కు కారణం ఇదే: విరాట్ కోహ్లీ

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. పాకిస్థాన్‌పై విరోచిత పోరాటంతో చిరస్మరణీయ విజయాన్నందించిన విరాట్.. నెదర్లాండ్స్‌తోనూ అదే జోరును కొనసాగించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు అజేయ హాఫ్ సెంచరీలు బాదడంతో విరాట్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆసియాకప్ 2022 వరకు నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన విరాట్.. నెల రోజుల సుదీర్ఘ విరామం అనంతరం రఫ్ఫాడిస్తున్నాడు. ముఖ్యంగా ఒత్తిడిలో రాణిస్తూ పాత కోహ్లీని తలపిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై చెలరేగిపోతున్నాడు. ఫాస్ట్, బౌన్సీలపై బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నాడు.

మానసిక బలంతో పాటు..
ఆసీస్ గడ్డపై ఇప్పటి వరకు 13 టీ20లు ఆడిన విరాట్.. 12 ఇన్నింగ్స్‌ల్లో 85 యావరేజ్‌తో 595 పరుగులు చేశాడు. తాజాగా ఆసీస్ గడ్డపై తాను ఇలా రాణించడానికి గల కారణాన్ని వెల్లడించాడు. మానసికంగా బలంగా ఉండటంతో పాటు పేస్, బౌన్సీ పిచ్‌లకు తగ్గట్లు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే ఆసీస్ గడ్డపై చెలరేగిపోవచ్చని తెలిపాడు. తాజాగా విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో బ్యాటింగ్‌కు ఆస్ట్రేలియాలో కన్నా మంచి పిచ్‌లు ఎక్కడా ఉండవని కోహ్లీ తెలిపాడు.

ఆసీస్ కన్నా మంచి పిచ్‌లు లేవు..
పేస్‌కు అలవాటు పడాలే కానీ పరుగుల వరద పారించొచ్చని తెలిపాడు. 'ఆసీస్‌లో రాణించేందుకు భారత్‌లో సన్నదమై రాలేం. ఇక్కడ నెట్స్‌లో ఆడితేనే పిచ్‌పై అవగాహన వస్తుంది. ఒకసారి బంతి ఎలా బౌన్స్, స్వింగ్ అవుతోందో తెలిస్తే బ్యాటింగ్‌కు ఇంతకంటే మంచి ట్రాక్‌లు దొరకవు అనిపిస్తుంది.

రోహిత్‌తో సంబంధం..
కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు మంచి సంబంధం ఉందని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐసీసీ టోర్నీలు గెలవడమే తామిద్దరి లక్ష్యమని చెప్పాడు. కొన్నిసార్లు రోహిత్‌కు తాను సలహాలు ఇస్తానని పేర్కొన్నాడు. 'కొన్నిసార్లు రోహిత్ శర్మకు సలహాలు ఇస్తాను. మ్యాచ్ గురించి మా మధ్య తరుచుగా చర్చ జరుగుతోంది. మేం ఇద్దరం బిగ్ టోర్నీలు గెలవడంపైనే ఫోకస్ పెట్టాం'అని విరాట్ చెప్పుకొచ్చాడు.

సౌతాఫ్రికాతో బిగ్ మ్యాచ్..
టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విజయాన్నందుకున్న రోహిత్ సేన.. అదే జోరులో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. ఈ రెండు విజయాలనంతరం సౌతాఫ్రికాతో మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు వర్షం కారణంగా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకున్న సఫారీ టీమ్.. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ క్రమంలోనే భారత్‌పై ఎలాగైన గెలిచి సెమీస్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications