T20 World Cup 2022: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న అరుదైన ఘనత.. 28 పరుగులు చేస్తే ఆ తోపు రికార్డు బద్దలే!

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో దుమ్మురేపుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతకు చేరువయ్యాడు. పాకిస్థాన్‌తో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ(53 బంతుల్లో 82 నాటౌట్).. నెదర్లాండ్స్‌తో(62 నాటౌట్) అదే జోరును కొనసాగించాడు. ఆసియాకప్ 2022 ముందు వరకు పేలవ ఫామ్‌తో సతమతమైన విరాట్‌కు నెల రోజుల సుదీర్ఘ విరామం కలిసొచ్చింది.
ఈ విరామం అనంతరం పాత కోహ్లీలా చెలరేగుతున్నాడు. పాకిస్థాన్‌తో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో భారత్‌కు విజయాన్నందించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికాతో మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో 28 పరుగులు చేస్తే వరల్డ్ రికార్డు అందుకోనున్నాడు.

28 పరుగులు చేస్తే..
ఈ మ్యాచ్ లో గనక కోహ్లీ 28 పరుగులు చేస్తే ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు శ్రీలంక మాజీ బ్యాటర్, దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దెనే పేరిట ఉంది. జయవర్దెనే.. టీ20 ప్రపంచకప్‌లో 31 మ్యాచ్‌లు ఆడి (31 ఇన్నింగ్స్) 1,016 పరుగులు చేశాడు. ఈ రికార్డుకు కోహ్లీ 28 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ.. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీల్లో 23 మ్యాచ్ లు ఆడి (21 ఇన్నింగ్స్) 989 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ 11 పరుగులు చేస్తే జయవర్దెనే తర్వాత వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్ అవుతాడు. 28 పరుగులు చేస్తే జయవర్దెనే రికార్డును అధిగమిస్తాడు.

22 ఇన్నింగ్స్‌ల్లోనే..
అధిగమించడమే కాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్న ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీల్లో కోహ్లీ సగటు 89.90 గా ఉండగా, జయవర్దెనే సగటు 39.07గానే ఉంది. 21 ఇన్నింగ్స్ లలో కోహ్లీ.. 12 హాఫ్ సెంచరీలు చేశాడు. జయవర్దెనే 6 హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ చేశాడు. కోహ్లీ సెంచరీ చేయకున్నా అత్యధిక స్కోరు 87 గా ఉంది. ఈ జాబితాలో టాప్-5లో భారత సారథి రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. కోహ్లీ తర్వాత విండీస్ వీరుడు క్రిస్ గేల్.. 33 మ్యాచ్ లలో 31 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి 965 పరుగులు చేశాడు. గేల్.. 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాదాడు.

రోహిత్ సైతం..
ఇక రోహిత్ ఇప్పటివరకు 35 మ్యాచ్ లలో 32 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి 904 పరుగులు చేశాడు. ఈ టోర్నీలలో రోహిత్.. 9 హాఫ్ పెంచరీలు చేయడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో రోహిత్ కూడా 61 పరుగులు చేస్తే గేల్ రికార్డును అధిగమించి టాప్-3కి చేరుకుంటాడు. రోహిత్ తర్వాత.. తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) 35 మ్యాచ్ లలో 34 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చి 897 పరుగులు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications