T20 World Cup 2022: అడిలైడ్ అంటే కోహ్లీకి పూనకమే.. సెమీస్‌లో ఇంగ్లండ్‌కు దబిడి దిబిడే!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్-12లో దుమ్మురేపిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో గ్రూప్-2 టాపర్‌గా సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..
గురువారం అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. 'మిషన్ మెల్ బోర్న్' పేరిట ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన.. లక్ష్యానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది. సెమీస్‌లో ఇంగ్లండ్ గండం ధాటి.. ఫైనల్ చేరాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది.

బంగ్లాపై అద్భుత విజయం..
ఈ మెగా టోర్నీలో అడిలైడ్ వేదికగా భారత్ ఒకే ఒక మ్యాచ్ ఆడగా.. ఇంగ్లండ్ ఇప్పటి వరకూ ఈ మైదానంలో ఆడలేదు. అడిలైడ్ ఓవల్ వేదికగా నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 5 పరుగులతో టీమిండియా గెలిచింది. టీమిండియా ఇప్పటికే ఇక్కడ ఒక మ్యాచ్ ఆడింది కాబట్టి.. అడిలైడ్ ఓవల్‌లోని పరిస్థితుల గురించి అవగాహన ఉండటం కలిసొచ్చే అంశం. అంతేకాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ మైదానంలో తిరుగులేదు. ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లోనూ విరాట్(64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

14 ఇన్నింగ్స్‌లు..907 పరుగులు..
ఇక్కడ ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 10 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 14 ఇన్నింగ్స్‌ల్లో 907 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండగా అత్యధిక స్కోర్ 141. అడిలైడ్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 90, 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ వేదికపై విరాట్ కోహ్లీ 90.7 సగటుతో పరుగులు చేశాడు. దాంతో గురువారం జరిగే కీలక పోరులోనూ విరాట్ చుక్కలు చూపిస్తాడని అతని ఫ్యాన్స్ ఇంగ్లండ్‌ను హెచ్చరిస్తున్నారు.

ముఖా ముఖిలో భారత్‌దే పై చేయి..
మరోవైపు ఇంగ్లండ్ కూడా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకే మెరుగైన రికార్డు ఉంది. ఈ ఫార్మాట్‌లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 22 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు విజయం సాధించింది. ఇంగ్లండ్ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు(2007, 2009, 2012) మూడు సార్లు మాత్రమే ఇరు జట్లు తలపడగా.. భారత్ రెండు సార్లు విజయాన్ని అందుకోగా.. ఇంగ్లండ్ ఒక్కసారి గెలిచింది.

ఇంగ్లండ్‌కు చెత్త రికార్డు..
అంతేకాకుండా అడిలైడ్‌లో ఇంగ్లండ్‌కు మెరుగైన రికార్డు లేదు.అడిలైడ్‌లో 17 వన్డేలు ఆడిన ఇంగ్లిష్ జట్టు కేవలం 4 మ్యాచ్‌ల్లోనే గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక్కడ ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాపై ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. అది కూడా 2011లోనే కావడం గమనార్హం. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications