ఓపెనర్‌గా రిషభ్ పంత్.. ఆ ఆలోచనే మాకు లేదు: టీమిండియా బ్యాటింగ్ కోచ్

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో వరుసగా విఫలమైన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ స్థానంలో రిషభ్ పంత్‌ను ఆడించే అవకాశం ఉందని వస్తున్న వార్తలను బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఖండించాడు. అసలు అలాంటి ఆలోచనే తమకు రాలేదని చెప్పాడు. రిషభ్ పంత్ నైపుణ్యం కలిగిన ఆటగాడే అయినా కొన్నాళ్లు ఆగాల్సిందేనని చెప్పాడు. అయితే ఏ క్షణంలోనైనా అవకాశం వస్తుందని, అందుకు సిద్దంగా ఉండాలని చెప్పామని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై సంచలన విజయాన్నందుకున్న రోహిత్ సేన.. అదే జోరు నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. అదే విజయ ఉత్సాహంలో ఆదివారం సౌతాఫ్రికాతో తలపడనుంది.

తీవ్ర ఒత్తిడిలో రాహుల్..
ఈ మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు టీమిండియా సెమీస్ బెర్తును ఖరారు చేసుకొనే అవకాశం ఉంది. అయితే ఓపెనర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం ఘోరంగా విఫలం కావడం భారత శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. భారీగా ఒత్తిడి ఉండే పాక్‌తో మ్యాచ్‌లో రాణించలేకపోయిన.. పసికూన నెదర్లాండ్స్‌తోనూ విఫలమయ్యాడు. భయంతో అతను బ్యాటింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ను రాహుల్ తప్పిస్తారా? అని ప్రశ్నించగా.. లేదని స్పష్టం చేశాడు.

రెండు మ్యాచ్‌లకే..
'ఇప్పటి వరకు టీమిండియా కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే ఆడింది. ఇందులో విఫలమైనంత మాత్రాన రాహుల్ బ్యాటింగ్ సామర్థ్యంపై నమ్మకం పోదు. అందుకే కేఎల్ రాహుల్ బదులు పంత్‌ను తీసుకొంటే ఎలా ఉంటుందనే దానిపై ఇంతవరకు ఆలోచించలేదు. ప్రాక్టీస్ మ్యాచుల్లో రాహుల్ చాలా బాగా ఆడాడు. అందుకే ఇలాంటి సమయంలో మరో ఆప్షన్ కోసం చూడటం లేదు. ఇక టీ20 ప్రపంచకప్‌లో భారత్ లక్ష్యం ఒకటే. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు బరిలోకి దిగాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాం. అయితే పిచ్ కండీషన్ ఎలా ఉందనేది అంచనా వేసి.. దానికి తగ్గట్టు ఆడటమే లక్ష్యం

టోర్నీ ఆసాంతం కోహ్లీ జోరు..
విరాట్ కోహ్లీ వరుసగా హాఫ్ సెంచరీలు సాధించడంపైనా విక్రమ్ స్పందించాడు. 'వరుసగా రెండు మ్యాచుల్లో విరాట్ కోహ్లీ అర్ధశతకాలు సాధించాడు. పిచ్, జట్టు పరిస్థితిని బట్టి అతను అద్భుతంగా ఆడాడు. గేమ్‌ను మార్చగల సమర్థుడు. ప్రత్యర్థి టీమ్ ఏదైనా సరే మ్యాచ్‌ను తన పరిధిలోకి తీసుకొనిరాగలడు. ఇప్పటి వరకు సూపర్‌గా ఆడాడు. తప్పకుండా ఇలాంటి ఆటనే టోర్నీ ఆసాంతం ఆడతాడు'' అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications