T20 World Cup 2022: నిన్న లంచ్.. నేడు ప్రాక్టీస్ సెషన్ బాయ్‌కట్.. ఆసీస్ ఆతిథ్యంపై టీమిండియా అసంతృప్తి!

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత ఆటగాళ్లకు అక్కడి నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. మంగళవారం సరైన ఫుడ్ పెట్టకపోవడంతో లంచ్‌ను భాయ్ కట్ చేసిన భారత ఆటగాళ్లు.. నేడు(బుధవారం) ఏకంగా ప్రాక్టీస్ సెషన్‌నే రద్దు చేశారు. భారత ఆటగాళ్ల పట్ల నిర్వాహకులు ప్రవర్తిస్తున్న తీరుపై ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసిన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఆతిథ్యం సరిగ్గా లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్‌ను సిడ్నీ గ్రౌండ్‌లో కాకుండా టీమిండియా ఉంటున్న హోటల్‌కు 45 నిమిషాలు టైమ్ పట్టే ప్రాంతంలో కేటాయించరట. దీంతో ప్రాక్టీస్‌కు ఆటగాళ్లు దూరంగా ఉన్నారు.

నిన్న ఇదే సమస్య..
ఇప్పటికే సిడ్నీ గ్రౌండ్‌కు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్‌లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వగా.. తాజాగా ప్రాక్టీస్ వేదిక కూడా మార్చడంతో భారత ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై సంచలన విజయంతో శుభారంభం చేసిన టీమిండియా.. నెదర్లాండ్‌తో తదుపరి పోరుకు సిద్దమైంది. గురువారం సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్దమవుతోంది. పాక్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే అక్కడి చేరుకున్న భారత ఆటగాళ్లు ఆ రోజు విశ్రాంతి అనంతరం ప్రాక్టీస్ ప్రారంభించారు. మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ ఉన్నప్పటికీ ఆటగాళ్లంతా నెట్స్‌లో శ్రమించారు. కోహ్లి, రోహిత్, రాహుల్, కార్తీక్, పంత్, హుడా దాదాపు 2 గంటల సెషన్‌లో పాల్గొన్నారు.

లంచ్ భాయ్ కట్..
ప్రాక్టీస్ అనంతరం మైదానం వద్ద ఏర్పాటు చేసిన లంచ్‌ను భారత ఆటగాళ్లు బహిష్కరించారు. ఆహారం చల్లగా ఉందని, తమ అవసరానికి తగినట్లుగా లేదని నిర్వాహకులపై మండిపడ్డారు. తమకు ఇష్టమైన ఇండియన్ ఫుడ్‌కు బదులు సాండ్‌విచ్‌లు పెట్టారని ఆటగాళ్లు ఆరోపించారు. 'ఆహారం ప్రమాణాల మేర లేదు. ప్రాక్టీస్ సెషన్ అనంతరం సాండ్‌విచ్ తినలేం'' అని ఓ ఆటగాడు ప్రముఖ వార్త సంస్థ పీటీఐకి తెలిపాడు. ఇక టీమిండియా ఆటగాళ్లకు సరైన ఆహారం ఏర్పాటు చేయకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చెమటోడ్చిన బ్యాటర్లు
ఇక నాణ్యమైన పేస్‌ను ఎదుర్కోవడంలో సరైన ఫుట్‌వర్క్ లోపించడమే కేఎల్ రాహుల్‌కు ఇప్పుడు పెద్ద సమస్య. ఈ నేపథ్యంలో సహాయ సిబ్బంది నిశిత పరిశీలనలో అతను మంగళవారం సాధన చేశాడు. ప్రాక్టీస్ నుంచి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చారు. దాంతో నెదర్లాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్ దూరంగా ఉంటాడని ప్రచారం జరగ్గా.. అలాంటిదేం లేదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. నిన్నటి ప్రాక్టీస్ సెషన్‌లో పేసర్లకు విశ్రాంతినిచ్చారు. ఎలాంటి సాధన లేనందున తర్వాతి మ్యాచ్ రోజు ఫాస్ట్‌బౌలర్లు తాజాగా బరిలోకి దిగనున్నారు. బ్యాట్స్‌మన్ మాత్రం ముమ్మురంగా సాధన చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications