
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పొడిగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచి ఒత్తిడికిలోను చేయడమే తమ ప్రణాళికని తెలిపాడు. టోర్నీలో ముందడుగేసేందుకు తమ సాయశక్తులా ప్రయత్నిస్తామని స్పష్టం చేశాడు. జట్టులో ఒక మార్పు చోటు చేసుకుందని, ఫకార్ జమాన్ స్థానంలో హారీస్ బరిలోకి దిగుతున్నాడని చెప్పాడు.
ఇక టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. పిచ్ పొడిగా ఉన్నప్పటికీ.. గ్రాస్ ఉన్నందున ప్రారంభంలో పేసర్లకు అడ్వాంటేజ్ ఉండనుందన్నాడు. తక్కువ స్కోర్‌కు పరిమితం చేస్తే చేజింగ్ సులువవుతుందని చెప్పాడు. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, జైత్రయాత్రను కొనసాగిస్తామని తెలిపాడు. ఇక డేవిడ్ మిల్లర్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని, గాయం కారణంగానే అతన్ని పక్కనపెట్టాల్సి వచ్చిందని చెప్పాడు. అతని స్థానంలో క్లాసెన్ రాగా.. కేశవమహరాజ్ స్థానంలో షంసీ ఆడుతున్నాడని చెప్పాడు. భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మిల్లర్ అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే.
తుది జట్లు:
పాకిస్థాన్: మహమ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజామ్(కెప్టెన్), మహమ్మద్ హారీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీం జూనియర్, షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, నసీమ్ షా
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్(కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రిలీ రోసౌ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, వ్యాన్ పార్నెల్, కగిసో రబడా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్, టబ్రైజ్ షంసీ