
రోహిత్ ఫామ్ ఒక్కటే..
అయితే, కొద్దిరోజులుగా విఫలమవుతూ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లోనూ రాణించలేదు. 7 బంతులు ఎదుర్కొని కేవలం 4 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ సైతం నాలుగు పరుగులే చేశాడు. కానీ కోహ్లీ వేవ్‌లో ఈ ఇద్దరి వైఫ్యం కొట్టుకుపోయింది. తాజాగా ఈ అంశంపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. గత కొద్ది రోజులుగా రోహిత్ తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదని చెప్పాడు. 'ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య రోహిత్ శర్మ ఫామ్. కొద్దిరోజులుగా అతని స్థాయికి తగినట్లు ఆడటంలేదు. అతను ఆడితే ఇతరులకు బ్యాటింగ్ చేయడం ఎంతో సులువవుతుంది.

వికెట్ కోల్పోకుండా ఆడటమే..
మంచి ఓపెనింగ్ ఇస్తే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి ఉండదు. వచ్చీ రాగానే మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా మంచి స్కోర్ సాధించవచ్చు. అప్‌కమింగ్ మ్యాచ్‌ల్లో మొదటి 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఉంటడమే కీలకం. నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా.. వికెట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.'అని గవాస్కర్ సూచించాడు. కాగా భారత్ గురువారం తన తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

పాండ్యాకు రెస్ట్ ఇవ్వండి..
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు అవసరమైతే హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వాలని గవాస్కర్ సూచించాడు. వచ్చే ఆదివారం సౌతాఫ్రికాతో మరో బిగ్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఫిట్‌నెస్ పరంగా అసౌకర్యంగా ఉన్న ఆటగాళ్లకు విశ్రాంతివ్వాలని పేర్కొన్నాడు. 'హార్దిక్ పాండ్యాకు ఏమైన ఫిట్‌నెస్ సమస్యలు ఉంటే అతనిక రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే సౌతాఫ్రికాతో వచ్చే ఆదివారం బిగ్ మ్యాచ్ ఉంది. కాబట్టి ఎవరూ అసౌకర్యంగా ఉన్నా వారికి తగినంత రెస్ట్ ఇచ్చి సండే బిగ్ గేమ్‌కు తాజాగా ఉండేలా జాగ్రత్త పడాలి.

తక్కువ అంచనా వేయకూడదు...
టీ20ల్లో ఏ జట్టును తేలిక తీసుకోకూడదు. ఇక మహమ్మద్ షమీని కచ్చితంగా ఆడించాలి. ఎందుకంటే అతను ఈ ఏడాది చాలా తక్కువ క్రికెట్ ఆడాడు. కాబట్టి అతనికి వీలైనంత మ్యాచ్ ప్రాక్టీస్ అందించాలి. హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇస్తే మాత్రం దీపక్ హుడాను జట్టులోకి తీసుకోవాలి. అతన్ని ఐదో స్థానంలో ఆడిస్తే భారత్‌కు తిరుగుండదు'అని గవాస్కర్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












