
ఓపెనర్ల వైఫల్యం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు సరైన శుభారంభం దక్కలేదు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(15), కేఎల్ రాహుల్(9) ఓకే ఓవర్లో వెనుదిరిగారు. మూడు బంతుల వ్యవధిలోనే ఈ ఇద్దరు ఔటయ్యారు. లుంగి ఎంగిడితో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రచించిన వ్యూహంలో చిక్కుకున్నారు. ఎంగిడి వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో రెండో బంతికి రోహిత్ శర్మ(15) రిటర్న్ క్యాచ్ ఇవ్వగా.. చివరి బంతికి రాహుల్(9) స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగారు. రోహిత్ శర్మను బలహీనతను టార్గెట్ చేస్తూ లుంగి ఎంగిడి షార్ట్ బాల్‌తో రోహిత్‌ను టెంప్ట్ చేయగా.. మిస్ టైమ్ అయిన బంతి అక్కడే గాల్లోకి లేచింది. దాంతో ఎంగిడి సునాయస క్యాచ్ అందుకొని రోహిత్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

సఫారీ ఉచ్చులో భారత బ్యాటర్లు..
ఆ తర్వాత ఫుట్‌వర్క్ లోపంతో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్‌ను బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్‌తో లుంగి ఎంగిడి బోల్తా కొట్టించాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని రాహుల్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ ఫీల్డర్ మార్కర్‌మ్ చేతిలో పడింది. వ్యూహాత్మకంగానే ఎంగిడి స్లిప్ ఫీల్డర్ పెట్టి ఈ బంతిని వేయగా.. రాహుల్ అతని ట్రాప్‌లో పడ్డాడు. క్రీజులోకి సూర్య, కోహ్లీ రాగా.. టీమిండియా పవర్ ప్లేలో 2 వికెట్లకు 33 పరుగులు చేసింది. ఎంగిడి వేసిన ఏడో ఓవర్‌లో కోహ్లీ(12) వరుస బౌండరీలో జోరుకనబర్చాడు. కానీ అదే ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు.

ఆదుకున్న సూర్య..
క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా.. నోర్జ్ వేసిన మరుసటి ఓవర్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. ఎంగిడి బౌలింగ్‌లో రబడా సూపర్ క్యాచ్‌కు హార్దిక్ ఔటయ్యాడు. దాంతో భారత్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిల్లో జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌తో కలిసి సూర్య ఆచితూచి ఆడాడు. ఓవైపు కార్తీక్ నిదానంగా ఆడుతున్నా.. సూర్య మాత్రం ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ప్రతీ ఓవర్‌లో బంతిని బౌండరీకి తరలించాడు. ఎంగిడి వేసిన 15వ ఓవర్‌లో సిక్స్, ఫోర్‌తో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
సూర్య ఔటవ్వడంతో..
మరుసటి ఓవర్‌లో కార్తీక్(6) ఔటవ్వడంతో 6వ వికెట్‌కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన అశ్విన్(7)తో కలిసి సూర్య స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అశ్విన్ ఔటైనా సూర్య ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతని జోరుకు పార్నెల్ కళ్లెం వేసాడు. దాంతో 19వ ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక చివరి ఓవర్‌లో మహమ్మద్ షమీ రనౌటవ్వగా.. భువీ, అర్ష్‌దీప్ 6 పరుగులు చేశారు. దాంతో ఇండియా 130 పరుగుల మార్క్‌ను అందుకోగలిగింది.


Click it and Unblock the Notifications












