Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓడినా.. బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌తో భారత్‌ను వణికించాం: షకీబ్ అల్ హసన్

 T20 World Cup 2022: Shakib Al Hasan says Its been the story when we play against India

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా భారత్‌ చేతిలో ఓటమి పాలైనా.. అద్బుతమైన ఆటతీరుతో ఆ జట్టును వణికించామని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. బుధవారం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 5 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన షకీబ్ అల్ హసన్.. భారత్‌తో ఇలాంటి పరాజయాలకు తమకు అలవాటేనన్నాడు. ప్రతీసారి విజయం ముంగిట చేతులెత్తుస్తున్నామని, గతంలో కూడా ఈ తరహా ఫలితాలు తమకు ఎదురయ్యాయని పేర్కొన్నాడు.

మా ఓటముల కథ కొనసాగుతోంది..

మా ఓటముల కథ కొనసాగుతోంది..

'భారత్‌తో మా ఓటముల కథ కొనసాగుతోంది. మేం ప్రతీసారి విజయానికి సమీపంగా వచ్చి చేతులెత్తేస్తున్నాం. ఈ మ్యాచ్‌ను ఇరు జట్లు ఆస్వాదించాయి. ఇది అద్భుతమైన మ్యాచ్. మేం ఇలాంటి ప్రదర్శననే ఆశించాం. ఆట అన్నప్పుడు ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడుతారు. మా జట్టులోనే లిటన్ దాస్ అద్భుతమైన బ్యాటర్. పవర్ ప్లేలో అతను ఆడిన విధానంతో తమ విజయం లాంఛనమేనని భావించాం. భారత్ విధించిన లక్ష్యాన్ని సునాయసంగా చేధిస్తామనుకున్నాం.

అందుకే టస్కిన్‌‌తో బౌలింగ్ చేయించా..

అందుకే టస్కిన్‌‌తో బౌలింగ్ చేయించా..

భారత్ జట్టులో టాప్-4 బ్యాటర్లు చాలా డేంజర్. వారిని కట్టడి చేయాలనే టస్కిన్‌తో ఆరంభంలో బౌలింగ్ చేయించా. దురదృష్టవశాత్తు అతను వికెట్లు తీయకపోయినా.. పరుగులివ్వకుండా కట్టడి చేశాడు. ఈ టోర్నీ‌ గురించి తాము పెద్దగా ఆలోచించ లేదు. ప్రశాంతంగా ఉంటూ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటంపై ఫోకస్ పెట్టాం. మాకు మరో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించడంపై దృష్టి సారిస్తాం'అని షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన కోహ్లీ, రాహుల్..

చెలరేగిన కోహ్లీ, రాహుల్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 64 నాటౌట్), కేఎల్ రాహుల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహముద్ మూడు వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

గెలిపించిన అర్ష్‌దీప్..

గెలిపించిన అర్ష్‌దీప్..

అనంతరం బంగ్లాదేశ్ నిర్ణీత 16 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. లిటన్ దాస్(27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60), నురుల్ హసన్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Wednesday, November 2, 2022, 18:45 [IST]
Other articles published on Nov 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+