T20 World Cup 2022: ఇంగ్లండ్ చేతిలో భారత్‌కు ఓటమి తప్పదు.. పాక్ మాజీ క్రికెటర్ జోస్యం!

కరాచీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న సెమీ ఫైనల్-2లో భారత జట్టుకు ఓటమి తప్పదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ కంటే ఇంగ్లండ్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోస్యం చెప్పాడు. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ ఇలా ఏ విభాగం చూసుకున్నా.. భారత్ కంటే ఇంగ్లండ్ మెరుగా ఉందని అభిప్రాయపడ్డాడు.
ఇక గ్రూప్-2 టాపర్‌గా సెమీస్ చేరిన భారత్.. గ్రూప్ -1 రన్నరప్ అయిన ఇంగ్లండ్‌తో బుధవారం అడిలైడ్ వేదికగా అమీతుమీ తేల్చుకోనుంది. గత రికార్డులు భారత్‌దే విజయమని చెబుతున్నా.. అఫ్రిది మాత్రం మరోసారి భారత్‌పై తన అక్కసు వెల్లగక్కాడు.

ఇంగ్లండ్‌దే విజయం..
పాకిస్థాన్ కు చెందిన సామా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది మాట్లాడుతూ.. భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'సెమీస్‌కు చేరుకున్న భారత్, ఇంగ్లండ్ రెండూ బలంగానే కనిపిస్తున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లూ మెరుగైన ఆటతో సెమీస్ చేరాయి. కానీ నా అభిప్రాయం ప్రకారం.. ఈ మ్యాచ్ లో భారత్ కంటే ఇంగ్లండ్ కే గెలిచే అవకాశాలున్నాయి. భారత్ తో పోల్చితే పాకిస్తాన్ కు 60-65 శాతం విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మూడు విభాగాల్లో మెరుగ్గానే..
అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఇంగ్లండ్ ఆటగాళ్ల కాంబినేషన్ బాగుంది. బౌలింగ్, బ్యాటింగ్, స్పిన్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలో చూసుకున్నా భారత్ కంటే ఇంగ్లండ్ మెరుగ్గా ఉంది. అయితే ఇది చాలా పెద్ద మ్యాచ్. ఆటలో తప్పులేమీ చేయకుండా, ఒత్తిడికి తట్టుకుని ఆడినవారిదే విజయం అవుతుంది. ఫీల్డ్‌లో 11 మంది ఆటగాళ్లు తమ సామర్థ్యం మేరకు ఆడితేనే విజయం సొంతమవుతుంది.'అని తెలిపాడు.

భారత్ ఫ్యాన్స్ ఫైర్..
అఫ్రిది వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. భారత్ కంటే మెరుగ్గా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. భారత జట్టులో ఓపెనర్ల వైఫల్యం మినహా అన్ని విభాగాలు రాణించాయని తెలిపాడు. అంతేకాకుండా భారత బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అఫ్రిది.. తన అనవసర వ్యాఖ్యలతో భారత్‌పై విషం చిమ్ముతాడని మండిపడుతున్నారు.

ముమ్మరంగా సాధన..
మిషన్ మెల్‌బోర్న్‌కు రెండు అడుగుల దూరంలో ఉన్న టీమిండియా.. అది అందుకోవడానికి ముమ్మరంగా సాధన చేస్తోంది. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నెట్స్‌లో గాయపడటం ఆందోళన రేకెత్తించినా.. అవి పెద్ద గాయాలు కావని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టునూ గాయాలు వేధిస్తున్నాయి. ఆ జట్టులో డేవిడ్ మలన్, మార్క్ వుడ్ కూడా గాయాల బాధితులే. ఈ ఇద్దరూ రేపటి మ్యాచ్ లో ఆడతారా..? లేదా..? అనేది సందేహంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications