T20 World Cup 2022: షాదాబ్ ఖాన్ బుల్లెట్ త్రో.. డేవాన్ కాన్వే రనౌట్.. అసలు ఇది పాక్ ఫీల్డింగేనా? (వీడియో)

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక సెమీ ఫైనల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. అదృష్టవశాత్తు సెమీ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్న ఆ జట్టు.. ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవాలనే కసితో ఆడుతున్నారు. కీలక నాకౌట్ పోరులో టాస్ కలిసి రాకున్నా.. ప్రశాంతంగా తమ గేమ్‌పై ఫోకస్ పెట్టారు. ఆదిలోనే కివీస్‌కు కోలుకోలేని దెబ్బతీసారు. ముఖ్యంగా పాక్ ఆటగాళ్లు సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొడుతున్నారు. అసలు ఈ ఫీల్డింగ్ చేస్తుంది పాకిస్థానేనా? అని సందేహం కలిగేలా మైమరిపిస్తున్నారు.
షాదాబ్ బుల్లెట్ త్రో..
సాధారణంగా పాక్ ఫీల్డింగ్ అనగానే.. చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేయడం... సునాయస రనౌట్లు చేజార్చడం, ఒక్క క్యాచ్ కోసం ఇద్దరు ఢీకొని నేలపాలు చేయడం వంటి ఘటనలు గుర్తొస్తాయి. కానీ ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు అసాధారణ ఫీల్డింగ్‌తో అదరగొడుతున్నారు. ముఖ్యంగా క్రీజులో పాతుకుపోయిన డేవాన్ కాన్వేను స్టన్నింగ్ త్రోతో పెవిలియన్ చేర్చారు. షాదాబ్ ఖాన్ సూపర్ ఫీల్డింగ్‌కు కాన్వే నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
అసలేం జరిగిందంటే...?
హరీస్ రౌఫ్ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్ చివరి బంతిని కాన్వే మిడాఫ్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లినా.. స్ట్రైక్ ఉంచుకోవాలనే తపనో లేక.. పాక్ ఫీల్డింగ్‌పై ఉన్న నమ్మకమో తెలియదు కానీ కాన్వే రిస్కీ సింగిల్ తీసాడు. కానీ బంతిని అందుకున్న షాదాబ్ ఖాన్.. బుల్లెట్ త్రో నేరుగా వికెట్లకు కొట్టాడు. దాంతో కాన్వే(20 బంతుల్లో 3 ఫోర్లతో 21) నిరాశగా పెవిలియన్ చేరాడు. దాంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 38 పరుగులు మాత్రమే చేసింది.
కష్టాల్లో న్యూజిలాండ్..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేంజరస్ గ్లేన్ ఫిలిప్స్(6) సైతం నిరాశపరిచాడు. మహమ్మద్ నవాజ్ వేసిన 8వ ఓవర్‌లో చివరి బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో కివీస్ 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్‌తో కలిసి కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications