Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: అదరగొట్టిన షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్.. సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం

T20 World Cup 2022: Shadab Khan, Iftikhar Ahmed Fifties Lift Pakistan to 185/9 Against South Africa

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు దుమ్మురేపారు. టాప్‌ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. షాదాబ్‌ ఖాన్‌ (52: 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51: 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో చెలరేగడంతో సౌతాఫ్రికా ముందు పాకిస్థాన్ 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఈ ఇద్దరికి తోడుగా మహమ్మద్ హారిస్ (28: 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మహమ్మద్‌ నవాజ్ (28: 22 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. నవాజ్‌తో కలిసి 52 పరుగులు, షాదాబ్‌తో కలిసి ఇఫ్తికార్‌ 82 పరుగులు జోడించి కీలక పాత్ర పోషించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్‌ నోకియా 4.. పార్నెల్, రబడా, ఎంగిడి, షంసి తలో వికెట్‌ తీశారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహ్మద్ రిజ్వాన్( 4), కెప్టెన్ బాబర్ ఆజమ్ (6) దారుణంగా విఫలమయ్యారు. మహమ్మద్ హరీస్(28) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. అతని జోరుకు నోర్జ్ కళ్లెం వేసాడు. దాంతో పవర్ ప్లేలో పాకిస్థాన్ 3 వికెట్లకు 42 పరుగులు చేసింది. ఆ వెంటనే షాన్ మసూద్(2) కూడా ఔటవ్వడంతో 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మహమ్మద్ నవాజ్, ఇప్తికర్ అహ్మద్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.

ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించిన అనంతరం మహమ్మద్ నవాజ్ ఔటవ్వగా.. షాదాబ్ ఖాన్‌తో కలిసి షాదాబ్ ఖాన్ జట్టును ముందుకు నడపించాడు. ఇఫ్తికర్ నిదానంగా ఆడినా.. షాదాబ్ చెలరేగాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక ధాటిగా ఆడే క్రమంలో షాదాబ్ ఔటవ్వగా.. 6వ వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మహమ్మద్ వసీం(0), హారీస్ రౌఫ్, ఇఫ్తికర్ అహ్మద్ ఔటైనా... పాక్ స్కోర్ 180 మార్క్ ధాటింది.

Story first published: Thursday, November 3, 2022, 15:52 [IST]
Other articles published on Nov 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+