T20 World Cup 2022: న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ విజయం.. సెమీస్ అవకాశాలు సజీవం!

బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022లో న్యూజిలాండ్ జోరు బ్రేక్ పడింది. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్ 202 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. సమష్టిగా రాణించి కివీస్ జోరుకు కళ్లెం వేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. జోస్ బట్లర్(47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73), అలెక్స్ హేల్స్(40 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో దుమ్మురేపారు. న్యూజిలాండ్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

గ్లేన్ ఫిలిప్స్ ఒక్కడే..
గ్లేన్ ఫిలిప్స్(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(40 బంతుల్లో 3 ఫోర్లతో 40) అతనికి అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, సామ్ కరన్ రెండు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు మెరుగవ్వగా.. కివీస్ సంక్లిష్టం చేసుకుంది. ఐర్లాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో కివీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ మ్యాచ్ ఓడినా..వర్షంతో రద్దు అయినా కివీస్ సెమీస్ చేరడం కష్టం.

ఓపెనర్లు విఫలం..
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. క్రిస్ వోక్స్ వేసిన రెండో ఓవర్‌లోనే ఓపెనర్ డేవాన్ కాన్వే(3) క్యాచ్ ఔటయ్యాడు. ఆ కొద్ది సేపటికే ఫిన్ అలెన్(16)ను సామ్ కరన్ బపెవిలియన్ చేర్చడంతో కివీస్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 40 పరుగులు మాత్రమే చేసింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో ఈ జోడీ స్కోర్ బోర్డు పరుగెత్తించింది. దాంతో కివీస్ 10 ఓవర్లలో 2 వికెట్లకు 76 పరుగులు చేసింది.

ఆదుకున్న కేన్-ఫిలిప్స్..
ఓవైపు కేన్ మామ నిదానంగా ఆడినా మరోవైపు గ్లేన్ ఫిలిప్స్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ భారీ షాట్లు కొట్టాడు. ఆదిల్ రషీద్ వేసిన 14వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన ఫిలిప్స్.. మరుసటి బంతికి డబుల్ తీసి 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బెన్ స్టోక్స్ విడదీసాడు. విలియమ్సన్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

భారీ షాట్లు ఆడే క్రమంలో..
ఆ కొద్దిసేటికే క్రీజులోకి వచ్చిన జేమ్స్ నీషమ్(6), డారిల్ మిచెల్(3), గ్లేన్ ఫిలిప్స్ ధాటిగా ఆడే క్రమంలో క్యాచ్ ఔటయ్యారు. దాంతో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లీంది. చివరి 12 బంతుల్లో కివీస్ విజయానికి 40 పరుగులు అవసరమవ్వగా.. 19వ ఓవర్ వేసిన వోక్స్ 14 పరుగులు ఇవ్వడంతో ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు అవసరమయ్యాయి. సామ్ కరన్ 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications