
మాకు సంబంధం లేని విషయం..
'ప్రస్తుతానికి టీ20 ప్రపంచకప్ టోర్నీ మాకు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మా దృష్టంతా ఈ మెగా టోర్నీ పైనే ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నదానిపై మేం ఇప్పుడు ఆందోళనపడట్లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వాటిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నాం. దానికి ఎలా సన్నద్ధమవ్వాలన్న దానిపై దృష్టిపెట్టాం. అలాగే తుది జట్టుపైనా పూర్తి స్పష్టతతో ఉన్నా. ప్రతి మ్యాచ్‌కు మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లందరూ ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. జట్టులోని 15 మంది ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారు. అందరూ టీమ్ సెలెక్షన్‌కు అందుబాటులో ఉన్నారు.

9 ఏళ్లుగా టైటిల్ లేదు..
ఐసీసీ టోర్నీల్లో మేం మంచి ప్రదర్శన చేయలేకపోతున్నాం. గత 9 ఏళ్లుగా ఒక్క ట్రోఫీ సాధించలేకపోయాం. మాలాంటి జట్టుకు ఇదో సవాల్. ఎన్నో అంచనాలు ఉంటాయి. పెద్ద టోర్నీల్లో ఇలా జరగడం కాస్త అసంతృప్తిగానే ఉంది. అయితే అవకాశాలు తప్పకుండా వస్తాయి. గతాన్ని మార్చేందుకు ఈ టోర్నీ రూపంలో మాకో అవకాశం లభించింది. ఇక్కడ మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఇలాంటి సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో ఆటగాళ్లకు తగినంత స్వేచ్ఛ ఇవ్వడం చాలా ముఖ్యం. ఫలితం గురించి ఆందోళన చెందకుండా ఉత్తమంగా ఎలా ఆడాలన్నదానిపై దృష్టిపెడుతున్నాం.

పాక్ బౌలింగ్ ఎలాంటిదో తెలుసు..
పాకిస్థాన్ బౌలింగ్ ఎంత సమర్థంగా ఉందో మాకు తెలుసు. గత టీ20 ప్రపంచకప్‌లో వారు మాపై పై చేయి సాధించారు. అయితే మాకు మంచి బ్యాటింగ్ అనుభవం ఉంది. రెండు బలమైన జట్లు తలపడటం మంచిదే. పాక్ బౌలింగ్ మాకు సవాల్ లాంటిది. దాన్ని ఎదుర్కోవడానికి మా బ్యాట్స్‌మెన్ సిద్ధంగా ఉన్నారు. మ్యాచ్ రోజు మేం అన్ని విభాగాల్లో రాణించగలిగితే ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించొచ్చు. కెప్టెన్‌గా నాకు ఇది బిగ్ గేమ్.

వాతావరణం ఎప్పుడు ఎలా..?
మెల్‌బోర్న్ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఉదయం లేవగానే వర్షం పడితే.. ఆ కొద్ది సేపటికే ఎండ వస్తుంది. రేపటి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నందున టాస్ కీలకం కానుంది. రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. పరిస్థితులు డిమాండ్ చేస్తే 10ఓవర్లు లేదా 5 ఓవర్లకు కూడా కుదిస్తారేమో. అయితే వాటన్నింటికీ మా ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అదృష్టవశాత్తూ ఈ మధ్యే భారత్‌లో 8 ఓవర్ల మ్యాచ్ ఆడిన అనుభవం కూడా మాకు ఉంది' అని రోహిత్ తెలిపాడు.


Click it and Unblock the Notifications
