Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనపెట్టాం: రోహిత్ శర్మ

 T20 World Cup 2022: Rohit Sharma reveals the reason why Yuzvendra Chahal not playing against Pakistan

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం పడే అవకాశాలు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, పిచ్ కూడా బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తెలిపాడు. పిచ్‌పై గ్రాస్ ఉన్న నేపథ్యంలో బంతి స్వింగ్ అయ్యే అవకాశం ఉందన్నాడు. ఈ అడ్వాంటేజ్‌ను తాము ఉపయోగించాలనుకుంటున్నామని తెలిపాడు. ఈ మెగా మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్దమయ్యామని చెప్పిన రోహిత్.. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడామని చెప్పాడు. ఇప్పుడు తమ ఆటను ఆస్వాదించాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.

తమ ఆట కోసం మైదానాలకు వచ్చిన ప్రేక్షకులను ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరిచామని, అలరిస్తామని నమ్మకం ఉందన్నాడు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఏడుగురు బ్యాటర్లు, ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఇందులో ఒక స్పిన్ ఆల్‌రౌండర్ ఉన్నాడని తెలిపాడు. తుది జట్టులో పెద్దగా మార్పులు లేకున్నా.. యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనపెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఊహించినట్లుగానే హర్షల్ పటేల్‌కు బదులు మహమ్మద్ షమీని తీసుకున్నారు. అయితే పాకిస్థాన్ జట్టులో లెఫ్టాండర్స్ ఉన్నారనే చాహల్‌కు బదులు అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు.

ఇక బాబర్ ఆజామ్ కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడినని తెలిపాడు. కానీ టాస్ తమ చేతుల్లో లేదు కదా? అన్నాడు. మేం 160-170 టార్గెట్ ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపాడు. ఈ మెగా టోర్నీ కోసం తాము అన్ని విధాల సిద్దమయ్యామని తెలిపిన బాబర్.. ఈ బిగ్ మ్యాచ్‌కు కూడా సిద్దంగా ఉన్నామని చెప్పాడు. వరుసగా రెండు సిరీస్‌లు ఆడి ఇక్కడికి వచ్చామని చెప్పిన బాబర్.. న్యూజిలాండ్‌తో ట్రైసిరీస్ కూడా గెలిచామని తెలిపాడు. తాము కూడా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్థాన్: బాబర్ ఆజామ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్(కీపర్), షాన్ మసూద్, హైదర్ అలీ, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, అసిఫ్ అలీ,షాహిన్ అఫ్రిది, హారీస్ రౌఫ్, నసీమ్ షా

Story first published: Sunday, October 23, 2022, 13:26 [IST]
Other articles published on Oct 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+