అందుకే షమీని కాదని అర్ష్‌దీప్ సింగ్‌కు ఆఖరి ఓవర్ ఇచ్చా: రోహిత్ శర్మ

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో ఓటమి నుంచి గట్టెక్కింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ అనేక మలుపులు తిరగగా.. చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి.
ఈ పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ.. ఎంతో అనుభవం కలిగిన భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీలకు బంతినివ్వకుండా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంచుకున్నాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న అర్ష్‌దీప్ అద్భుత బౌలింగ్‌తో 14 పరుగులే ఇచ్చి భారత్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

గత 9 నెలలుగా..
అయితే మ్యాచ్ అనంతరం ఆఖరి ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్‌కు ఇవ్వడానికి గల కారణాన్ని రోహిత్ శర్మ వెల్లడించాడు. గత 9 నెలలుగా అర్ష్‌దీప్ చివరి ఓవర్‌లో నిలకడగా రాణిస్తున్నాడని, అందుకే అతనిపై నమ్మకం ఉంచానని తెలిపాడు. అర్ష్‌దీప్‌తో పాటు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ను రోహిత్ కొనియాడాడు. 'జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ఆ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను మేం ఎప్పటి నుంచో సిద్ధం చేసి ఉంచాం. చివరి ఓవర్‌లో షమీ, అర్ష్‌దీప్‌లో ఒకరిని ఎంచుకోవాలనుకున్నాం. కానీ 9 నెలలుగా చివరి ఓవర్లలో రాణిస్తోన్న అర్ష్‌దీప్‌కు ఆ అవకాశం ఇచ్చాం.

రాహుల్ అద్భుతం..
కోహ్లీ ఈ టీ20 ప్రపంచకప్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేఎల్ రాహుల్ ఎంత అద్భుతమైన ఆటగాడో ఈ మ్యాచ్‌తో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఫీల్డింగ్ విషయంలో మా కుర్రాళ్లు అదరగొట్టారు. కొన్ని అద్భుతమైన క్యాచ్‌లను అందుకుని సత్తా చాటారు'' అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.యార్కర్లు వేయగల సత్తా అర్ష్‌దీప్ సింగ్‌కు ఉండటంతోనే రోహిత్ తనను కాదని అర్ష్‌దీప్ సింగ్‌కు చివరి ఓవర్ ఇచ్చాడని మహమ్మద్ షమీ తెలిపాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చివరి ఓవర్ గురించి ప్రస్తావించగా.. అది కెప్టెన్ చాయిస్ అని పేర్కొన్నాడు.

యార్కర్లు అద్భుతంగా వేయడంతో..
'చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎవరితో వేయించాలనేది కెప్టెన్ చాయిస్. బహుషా అర్ష్‌దీప్ సింగ్ యార్కర్లు బాగా వేయగలడని రోహిత్ చివరి ఓవర్ అతనికిచ్చాడనుకుంటా. అతని విశ్వాసాన్ని పెంచాలనే రోహిత్ ఇలా చేసి ఉండొచ్చు'అని షమీ చెప్పుకొచ్చాడు. ఈ విజయంతో టీమిండియా గ్రూప్2లో టాప్ ప్లేస్‌కు చేరింది. జింబాబ్వేతో చివరి మ్యాచ్‌లో గెలిచినా.. వర్షంతో రద్దయినా సెమీస్ చేరుతోంది. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications