For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే అశ్విన్‌‌‌తో ఆ ఓవర్ వేయించా.. మా తప్పిదాలే ఓటమిని శాసించాయి: రోహిత్ శర్మ

T20 World Cup 2022: Rohit Sharma reveals the reason why he giving 18th over to Ashwin against South Africa

పెర్త్: చెత్త ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ వైఫల్యం సౌతాఫ్రికాతో తమ ఓటమికి కారణమైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మెగా టోర్నీలో భారత జట్టుకు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌లో మూడు రనౌట్లతో పాటు రెండు క్యాచ్‌లు నేలపాలు చేసిన రోహిత్ సేన మూల్యం చెల్లించుకుంది. అంతేకాకుండా కీలక 18వ ఓవర్‌ను రవిచంద్రన్ అశ్విన్‌కు ఇవ్వడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఆ ఓవర్‌లో మిల్లర్ రెండు సిక్స్‌లు బాది మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు. అయితే అశ్విన్‌‌ను చివరి వరకు ఆపి ఉంటే మ్యాచ్ ఉత్కంఠగా మారేదని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు.

అందుకే ఆశ్విన్‌కు ఇచ్చా..

అందుకే ఆశ్విన్‌కు ఇచ్చా..

ఇక ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం రోహిత్ ముందు హర్షా భోగ్లే ప్రస్తావించగా.. హిట్ మ్యాన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. గత మ్యాచ్‌ల్లో లాస్ట్ ఓవర్ స్పిన్నర్లకు ఇస్తే ఏం జరిగిందో మనమంతా చూశామని, కొత్త బ్యాటర్ క్రీజులో ఉన్నాడనే అశ్విన్‌కు బంతినిచ్చానని వివరణ ఇచ్చాడు. 'లాస్ట్ ఓవర్ స్పిన్నర్లకు ఇస్తే ఏం జరిగిందో నేను గత మ్యాచ్‌ల్లో చూశాను. అందుకే నేను వేరే మార్గాన్ని ఎంచుకున్నాను. నేను అనుకున్నట్లు అశ్విన్ బౌలింగ్ పూర్తయి ఉంటే సీమర్స్ తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను గెలిపించేవారు. కొత్త బ్యాటర్ క్రీజులోకి రావడంతో అశ్విన్‌కు బంతినివ్వడానికి సరైన సమయం అనిపించింది. కానీ మిల్లర్ అద్భుత షాట్లతో నా ప్రణాళికను దెబ్బతీసాడు.'అని రోహిత్ స్పష్టం చేశాడు.

బ్యాటింగ్ వైఫల్యం..

బ్యాటింగ్ వైఫల్యం..

తాము ఊహించినట్లుగానే పిచ్ పేసర్లకు సహకరించిందని, కానీ బ్యాటింగ్‌లో కొన్ని పరుగులు తక్కువ చేయడం, కీలక సమయంలో వచ్చిన అవకాశాలను చేజార్చడం తమ ఓటమిని శాసించిందన్నాడు. 'పిచ్ సీమర్స్‌కు అనుకూలిస్తుందని ముందే ఊహించాం. అందుకే ఈ వికెట్‌పై చేజింగ్ కష్టమని భావించి ముందుగా బ్యాటింగ్ చేశాం. కానీ బ్యాటింగ్‌లో కొన్ని పరుగులు తక్కువగా చేశాం. అయినప్పటికీ అద్భుతంగా పోరాడాం. సౌతాఫ్రికా మా కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేసింది. 10 ఓవర్లకు 40/3 ఉన్న ఆ జట్టు.. మార్క్‌రమ్-మిల్లర్ మ్యాచ్ విన్నింగ్ పార్టనర్‌షిప్‌తో విజయాన్నందుకుంది.

చెత్త ఫీల్డింగ్..

చెత్త ఫీల్డింగ్..

ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్ మరి దరిద్రంగా ఉంది. కీలక సమయంలో వచ్చిన అవకాశాలను వదిలేశాం. రనౌట్స్‌తో పాటు క్యాచ్‌లు నేలపాలు చేశాం. గత మ్యాచ్‌ల్లోలా ఫీల్డింగ్‌లో రాణించలేకపోయాం. మేం ఈ విషయంలో మెరుగవ్వాల్సింది. ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. ఈ తప్పిదాలను సవరించుకొని టోర్నీలో ముందడుగువేస్తాం'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మిల్లర్.. కిల్లర్..

మిల్లర్.. కిల్లర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68) విరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(4/29) నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్(3/15) మూడు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఎయిడెన్ మార్క్‌రమ్(41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52), డేవిడ్ మిల్లర్(46 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అశ్విన్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, October 30, 2022, 20:58 [IST]
Other articles published on Oct 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+