Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే దీపక్ హుడాను కాదని అక్షర్ పటేల్‌ను తీసుకున్నాం: రోహిత్ శర్మ

T20 World Cup 2022: Rohit sharma reveals the reason why Deepak Hooda not playing against Bangladesh

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్‌తో జరగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం వచ్చే సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తెలిపాడు. అంతేకాకుండా ఈ పిచ్‌పై మంచి స్కోర్ వస్తుందని తాను అస్సలు అనుకోవడం లేదన్నాడు. ఈ మ్యాచ్‌ కోసం అన్ని విధాలుగా సిద్దమయ్యామని చెప్పిన షకీబ్ అల్ హసన్.. తమ జోరు కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపాడు. జట్టులో ఒకే ఒక మార్పు చేశామన్న షకీబ్.. సర్కార్ స్థానంలో ఇస్లామ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.

ఇక ఊహించినట్లుగానే భారత జట్టు‌లో మార్పు జరిగింది. అయితే రిషభ్ పంత్‌కు అవకాశం దక్కుతుందని భావించినప్పటికీ.. రోహిత్ అతనికి అవకాశం ఇవ్వలేదు. గత మ్యాచ్‌లో విఫలమైన దీపక్ హుడా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకొచ్చాడు. యుజ్వేంద్ర చాహల్‌ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు. బంగ్లాదేశ్‌లో లెఫ్టాండర్స్ ఉన్న నేపథ్యంలో అశ్విన్‌ను కొనసాగించిన రోహిత్.. అడిలైడ్ స్పిన్‌కు అనుకూలిస్తుందని అక్షర్ పటేల్‌ను తీసుకున్నాడు.

ఇక టాస్ గెలిస్తే తాను బ్యాటింగ్ ఎంచుకునేవాడినన రోహిత్ తెలిపాడు. 'స్కోర్ బోర్డుపై పరుగులు చేయడం చాలా ముఖ్యం. బ్యాటింగ్‌లో రాణించడంపై మేం ఫోకస్ పెట్టాం. టీ20 ఫార్మాట్‌లో ప్రతీ మ్యాచ్ గెలవడం ముఖ్యం. గత మ్యాచ్‌లో మేం ఆశించిన రీతిలో రాణించలేకపోయాం. అడిలైడ్ గ్రౌండ్ ఆస్ట్రేలియాలోనే అద్భుతమైనది. వాతావరణం కూడా బాగుంది. హుడా స్థానంలో అక్షర్‌ను తీసుకున్నాం'అని రోహిత్ తెలిపాడు.

తుది జట్లు:

భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

బంగ్లాదేశ్: నజ్ముల్ హోస్సెన్ షాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫిఫ్ హోస్సెన్, యాసిర్ అలీ, మోసద్దేక్ హోస్సెన్, నురుల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహముద్, టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్

Story first published: Wednesday, November 2, 2022, 13:29 [IST]
Other articles published on Nov 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+