
మిడిలార్డర్ లుక లుకలు..
రోహిత్ సేన ముందుగా ఫోకస్ పెట్టాల్సిన సమస్య మిడిలార్డర్ వైఫల్యం. మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతోనే ఆసియాకప్ 2022లో టీమిండియా ఫైనల్ చేరలేకపోయింది. పాకిస్థాన్, శ్రీలకంతో జరిగిన మ్యాచ్‌ల్లో టాపార్డర్ బ్యాటర్లు కోహ్లీ, కేఎల్ రాహుల్ , రోహిత్ శర్మ రాణించినా.. మిడిలార్డర్ ఆ ఆరంభాలను అందిపుచ్చుకోలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ ఆడపా దడపా ఇన్నింగ్స్‌లు ఆడినా.. హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా నాలుగు, ఐదు, ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లపై టీమ్‌మేనేజ్‌మెంట్ సిరీయస్‌గా ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఈ ముగ్గురు బ్యాటర్లలో ఒకరు ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో కొనసాగాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా వచ్చి రావడంతోనే భారీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. కాబట్టి సరైన ఆటగాళ్లను ఎంచుకోవాల్సిన బాధ్యత రోహిత్‌తో పాటు ద్రవిడ్‌పై ఉంది.

దినేశ్ కార్తీక్ vs రిషభ్ పంత్..
ఇక వికెట్ కీపర్లలో దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్‌లో ఎవరిని ఆడించాలనే విషయంపై కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇద్దరిని ఆడించే పరిస్థితి లేదు కనుక ఆ ఒకరు ఎవరా? అనేది తేల్చుకోవాల్సి ఉంది. ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి. అయితే ఆసియాకప్‌లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం డీకేను కాదని పంత్‌కు అవకాశం ఇచ్చిన టీమ్‌మేనేజ్‌మెంట్ దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ రాణించలేడనే అపవాదు ఉంది. పైగా దినేశ్ కార్తీక్ ఫినిషర్‌గా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టుకు కావాల్సిన పరుగులు చేయగలడు. అయితే ఇక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ జట్టుకు సమస్యగా మారింది. జట్టులోని ఆటగాళ్లంతా రైట్ హ్యాండర్లే కావడంతో పంత్‌ను ఆడించక తప్పడం లేదు. కాబట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రవీంద్ర జడేజాను భర్తీ చేసే ప్లేయర్..
లేని పోని అడ్వెంచర్ గేమ్స్‌తో టీమిండియా మేనేజ్‌మెంట్ పెద్ద తలనొప్పిని తెచ్చుకుంది. సూపర్ ఫామ్‌తో పాటు సరైన టీమ్ కాంబినేషన్‌కు ఉపయోగపడే జడేజాను దూరం చేసుకోవడం జట్టుకు తీరని నష్టం జరిగింది. మొకాలి శస్త్ర చికిత్సతో జడేజా టీ20 ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానాని భర్తీ చేసే ఆటగాడిని ఎంచుకోవడం టీమిండియా ముందున్న అతిపెద్ద సవాల్. జడేజాను నెంబర్ 4లో ప్రమోట్ చేస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. దాంతో పంత్‌ను పక్కనపెట్టే వెసులుబాటు కలిగింది. కానీ జడేజా గాయంతో మళ్లీ కథ మొదటికి వచ్చి టీమ్ వైఫల్యానికి కారణమైంది. అయితే జడేజాను భర్తీ చేసే సత్తా అక్షర్ పటేల్‌కు ఉంది. గతంలో కూడా జడేజా గైర్హాజరీలో అతను సత్తా చాటాడు. మరీ టీమ్‌మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో చూడాలి.

బుమ్రా, హర్షల్ పటేల్ ఎంపిక..
గాయాలతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లు కోలుకున్నారు. బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లోనూ పాసయ్యారు. అయితే ఈ ఇద్దరికి మెగా టోర్నీ ముందుకు కావాల్సిన మ్యాచ్ ప్రాక్టీస్ అందించాలి. అంతేకాకుండా ఈ ఇద్దరి ఎంపిక నేపథ్యంలో జట్టును సర్దు బాటు చేయాలి. నలుగురు పేసర్లతో బరిలోకి దిగితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగినప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలనేదానిపై కసరత్తు చేయాలి. దీని కోసం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications
