Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: నువ్వే కింగ్ అంటూ ఎత్తుకున్న రోహిత్!.. కన్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (వీడియో)

T20 World Cup 2022: Rohit Sharma lifted Virat Kohli After India beat Pakistan goes viral

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా శుభారంభం చేసింది. ఉత్కంఠకే ఊపిరి అందని మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకుంది. పాకిస్థాన్‌తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్) విరోచిత పోరాటంతో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా నడిచిన జట్టును తనదైన బ్యాటింగ్‌తో విజయం వైపు నడిపించాడు. ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకున్న విరాట్ తన అనుభవంతో విజయం ముంగిట నిలబెట్టాడు.

సస్పెన్స్ థ్రిల్లర్..

చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. షాదాబ్ ఖాన్ వేసిన తొలి బంతికి క్రీజులో సెట్ అయిన హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ సింగిల్ తీయగా.. మూడో బంతికి విరాట్ క్విక్ డబుల్ తీసాడు. నాలుగో బంతిని నోబాల్‌గా వేయగా విరాట్ కోహ్లీ సిక్స్‌గా మలిచాడు. దాంతో చివరి మూడు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఫ్రీ హిట్ బాల్‌ను వైడ్‌గా వేయడంతో 3 బంతుల్లో 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే మరుసటి బంతికి విరాట్ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. ఫ్రీ హిట్ కావడంతో భారత బ్యాటర్లు చాకచక్యంగా 3 పరుగులు తీసారు. దాంతో 2 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి దినేశ్ కార్తీక్ స్టంపౌటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితిసీంది. ఆఖరి బంతిని వైడ్‌గా వేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దాంతో అశ్విన్ సింగిల్ తీసి విజయా లాంఛనాన్ని పూర్తి చేశాడు.

విరాట్ కోహ్లీ భావోద్వేగం..

విరాట్ కోహ్లీ భావోద్వేగం..

ఓటమి అంచుల నుంచి విజయాన్నందుకోవడం.. ఈ విజయంలో తన పాత్ర ఉండటంతో విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న ఆనంద బాష్ఫాలను ఆఫుకోలేకపోయాడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో ఇది అత్యుత్తమ ఇన్నింగ్స్‌ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్ భారత్ గెలవడానికి విరాట్ కోహ్లీ ఒక్కడే. మ్యాచ్ జరిగిన పరిస్థితి ఓటమి నుంచి గట్టెక్కడం చూస్తే టీమిండియా ప్రపంచకప్ గెలిచినంత ఆనందం కలిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం... విరాట్ కోహ్లీ ఎత్తుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ గెలిపించినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

దటీజ్ కింగ్ కోహ్లీ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీకి అండగా హార్దిక్ పాండ్యా(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 40) రాణించాడు.

Story first published: Sunday, October 23, 2022, 18:17 [IST]
Other articles published on Oct 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+