T20 World Cup 2022: చిన్న దేశాలపైనే సూర్య ప్రతాపం.. రోహిత్, రాహుల్ రిటైర్మెంట్ తీసుకోండి! ఫ్యాన్స్ ఫైర్!

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(4)తో పాటు కేఎల్ రాహుల్(4), మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్(15) దారుణంగా విఫలమయ్యారు. పాక్ పేసర్లు తమ క్వాలిటీ బౌలింగ్‌తో టీమిండియాను దెబ్బకొట్టారు. నసీమ్ షా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ బంతి వికెట్లపై ఆడుకోని పెవిలియన్ చేరగా.. హారిస్ రౌఫ్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ స్లిప్ క్యాచ్‌గా ఔటయ్యాడు.
31 పరుగులకే 4 వికెట్లు..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రెండు బౌండరీలతో దూకుడు కనబర్చాడు. కానీ అతని జోరుకు హరిస్ రౌఫ్ బ్రేక్ వేసాడు. షాట్ పిచ్ బాల్‌తో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో అక్షర్ పటేల్‌ను టాపార్డర్ బ్యాటర్‌గా ప్రమోట్ చేస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం వికటించింది. అక్షర్ పటేల్.. విరాట్ కోహ్లీతో సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ రనౌట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. బంతి కన్నా ముందే రిజ్వాన్ గ్లోవ్స్ వికెట్లను తాకినట్లు కనిపించింది. కానీ అంపైర్ మాత్రం ఔటిచ్చాడు. దాంతో భారత్ 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
రిటైర్మెంట్ ప్రకటించండి...
టీమిండియా ఆటతీరును చూసి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ తరహా ప్రదర్శనను అస్సలు ఊహించలేదని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లపై మండిపడుతున్నారు. రోహిత్, రాహుల్‌లు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తపుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కీలక మ్యాచ్‌లు ఆడకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, మ్యాచ్ పరిస్థితి చూసుకోకుండా ఆడితే ఎలా అని మండిపడుతున్నారు.
చిన్నదేశాలపై ఆడుకోండి..
ఇక సూర్య ప్రతాపం చిన్నదేశాలపైనేనా? పాకిస్థాన్ వంటి క్వాలిటీ బౌలింగ్ ఆడటం రాదా? అని సెటైర్లు పేల్చుతున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్య నిర్లక్ష్యంగా ఆడటం తీవ్ర నిరాశకు గురి చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే దానికి ప్రధానం కారణం రోహిత్, సూర్య, రాహుల్ వైఫల్యమేనని కామెంట్ చేస్తున్నారు. ఈ ఓటమికి ఈ ముగ్గురు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
చెలరేగిన బౌలర్లు...
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను వణికించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications