ఆ బంతి వైడ్ కాకుంటే.. క్రికెటర్‌గా నా కథ ముగిసేది: అశ్విన్

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో తాను వదిలేసిన బంతి వైడ్ కాకపోయి ఉంటే కెరీర్‌కు వీడ్కోలు పలికేవాడినన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విరోచిత పోరాటంతో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అశ్విన్ సమయస్పూర్తిని ప్రదర్శించి జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసిందే.

అదే చివరి మ్యాచ్
పాక్‌తో మ్యాచ్‌లో మహమ్మద్ నవాజ్ వేసిన ఆ బంతి వైడ్ బాల్ అవ్వకుండా ప్యాడ్స్‌ను తాకి ఉంటే ఏం చేసేవాడివి?అని తాజాగా ప్రశ్నించగా.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలా జరిగి ఉంటే అదే తనకు చివరి మ్యాచ్ అయ్యేదన్నాడు.'ఆ మ్యాచ్ తర్వాత చాలా మంది ఇదే ప్రశ్న అడిగారు. ఆ రోజు నిజంగానే బంతి వైడ్ అవ్వకుండా నా ప్యాడ్స్‌ను తాకి ఉంటే నేరుగా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయేవాడిని. ఫోన్ చేతిలోకి తీసుకుని.. నేను ఇంతటితో నా క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు అంటూ ట్విటర్‌లో ఆటకు వీడ్కోలు పలికేవాడినని వారికి చెప్పాను (నవ్వుతూ)'' అని అశ్విన్ తెలిపాడు.

స్మార్ట్‌గా ఆడి..
చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో అశ్విన్ తెలివైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. నవాజ్ వేసిన బంతి వైడ్ అవుతుందని గ్రహించి దానిని వదిలేశాడు. దీంతో ఆఖరి బంతిని లాఫ్టెడ్ షాట్‌కు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. విరాట్ కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్ ముగ్దుడయ్యానని చెప్పిన అశ్విన్.. అతని ఇన్నింగ్స్ నిలబెట్టాలనే కసితోనే మైదానంలోకి వచ్చానని చెప్పాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చంద్రముఖిలా కోహ్లీ..
'31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయాం. కోహ్లీ, హార్దిక్ పాండ్యా చెరో 60 పరుగులు చేస్తే తప్ప గెలవలేమనిపించింది. అవసరమైతే నేనూ బ్యాటింగ్‌లో ఒక చేయి వేయాలని అనుకున్నాను. అయితే కోహ్లీ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. తొలి 45 బంతుల్లో నిదానంగా ఆడిన అతను ఆ తర్వాత దుమ్మురేపాడు. అతని బ్యాటింగ్ నాకు చంద్రముఖి సినిమాను గుర్తు చేసింది. గంగ నుంచి చంద్రముఖిలా మారినట్లు అనిపించింది.

మా ఇంటిపై రాళ్లు వేయలేరనుకున్నా..
కోహ్లీ వచ్చి లెగ్ స్టంప్ మీదుగా బంతి వేస్తున్నాడు. జరిగి కవర్స్ మీదుగా కొట్టు అని సలహా ఇచ్చాడు. పరిస్థితి ఇంత ఉత్కంఠగా ఉన్నప్పుడు కవర్స్ మీదుగా కొట్టడం ఏంటని అనుకున్నాను. చివరి బంతి దిశను అంచనా వేసి అది వైడ్ బాల్ అని వదిలేశా. ఇక నా ఇంటిపై ఎవరూ రాళ్లు వేయలేరనే ధైర్యం వచ్చింది. కోహ్లీ చేత హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టించిన దేవుడు నన్ను సింగిల్ తీయనియడా? అని అనుకున్నా. చివరకు అదే జరిగింది. ఈ అద్భుతమైన మ్యాచ్‌లో భాగమైనందుకు గర్వంగా అనిపించింది'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications