T20 World Cup 2022: పాకిస్థాన్ X సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. డక్‌వర్త్ విజయం ఎవరిదంటే..?

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్-సౌతాఫ్రికా మధ్య జరుగుతు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. షాదాబ్ ఖాన్ (52: 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇఫ్తికార్ అహ్మద్ (51: 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆదుకున్నారు. ఈ ఇద్దరికి తోడుగా మహమ్మద్ హారిస్ (28: 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మహమ్మద్ నవాజ్ (28: 22 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించడంతో పాక్ భారీ స్కోర్ చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోకియా నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్, రబడా, ఎంగిడి, షంసి తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి 9 ఓవర్లలో 4 వికెట్లకు 69 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో హెన్రీచ్ క్లాసెన్(2 బ్యాటింగ్), ట్రిస్టన్ స్టబ్స్(2 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ క్వింటన్ డికాక్(0) డకౌటవ్వగా.. రిలీ రసౌ(7) సైతం నిరాశపరిచాడు. కెప్టెన్ టెంబా బవుమా(19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 36), ఎయిడెన్ మార్క్‌రమ్(14 బంతుల్లో 4 ఫోర్లతో 20) పొరాడే ప్రయత్నం చేసినా అఫ్రిది, షాదాబ్ ఖాన్ దెబ్బతీసారు.
ఇక కనీస 5 ఓవర్ల ఆట పూర్తయినందున వర్షం విరామం ఇవ్వకుంటే.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనున్నారు. ప్రస్తుతానికి ఈ పద్దతి ప్రకారం సౌతాఫ్రికా 16 పరుగుల వెనుకంజలో ఉంది. వర్షం ఇలానే కొనసాగితే పాకిస్థాన్‌నే విజయం వరించనుంది. అదే జరిగితే పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు మెరుగవ్వనుండగా.. గ్రూప్ 2 క్వాలిఫికేషన్ సినారియో మరింత రసవత్తరంగా మారనుంది.
అప్పుడు సౌతాఫ్రికా ఇబ్బందుల్లో పడనుంది. నెదర్లాండ్స్‌తో జరగనున్న చివరి మ్యాచ్‌లో ఆ జట్టు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే భారత్ సెమీస్ అవకాశాలపై కూడా ప్రభావం పడనుంది. జింబాబ్వేతో జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో భారత్ గెలవాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications