
అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియాను వర్షం వణికిస్తుంది. బంగ్లాదేశ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆట ఆగిపోయే సరికి 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది.
ప్రస్తుతం డక్ వర్త్ లూయిస్ పద్దతని అమలు చేస్తే బంగ్లాదేశ్‌నే విజయం వరించనుంది. ఈ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్ 17 పరుగుల ముందంజలో ఉంది.
విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 64 నాటౌట్), కేఎల్ రాహుల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ ముందు టీమిండియా 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. రాహుల్, కోహ్లీ హాఫ్ సెంచరీలకు తోడుగా సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 4 ఫోర్లతో 30) రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహముద్ మూడు వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ దుమ్మురేపింది. లిటన్ దాస్‌ను ఓపెనర్‌గా పంపిస్తూ ఆ జట్టు చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. వర్ష సూచనల నేపథ్యంలో తెలివిగా ఆడిన బంగ్లా బ్యాటర్లు ఫస్ట్ ఓవర్ నుంచే దాడికి దిగారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 2వ ఓవర్‌లో మూడు బౌండరీలు బాదిన లిటన్ దాస్.. భువీ బౌలింగ్ 6, 4, 4 కొట్టాడు. షమీ బౌలింగ్‌లో 6,4, 4 కొట్టడంతో బంగ్లాదేశ్ పవర్‌ప్లేలో 60 పరుగులు చేసింది. ఇందులో లిటన్ దాస్ ఒక్కడే 56 పరుగులు చేయగా.. నజ్ముల్ 4 పరుగులు మాత్రమే చేశాడు.