For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: సెమీస్‌కు న్యూజిలాండ్.. శ్రీలంకపైనే ఆస్ట్రేలియా ఆశలు!

T20 World Cup 2022 Qualification Scenario Group 1: Australia Hopes On Sri Lanka

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 35 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 7 పాయింట్లు(మూడు విజయాలు, ఒకటి రద్దు, మరొకటి ఓటమి)తో గ్రూప్-1 టాపర్‌గా నాకౌట్ చేరింది. 2.113 మెరుగైన రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగనుంది. న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖారారు కావడంతో... రెండో సెమీస్ బెర్త్‌ ఎవరికి దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం కోసం ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి.

మెరుగైన రన్‌రేట్ ఉన్నందున ఇంగ్లండ్‌కే అవకాశాలున్నాయి. న్యూజిలాండ్ బెర్త్ ఖారారైన నేపథ్యంలో ఆస్ట్రేలియాకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ జట్టు సెమీస్ అవకాశాలు శ్రీలంక విజయంపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విజయం సాధించినా.. నాకౌట్ చేరే పరిస్థితి లేదు.

ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధిస్తే ఆ జట్టుకు ఏడు పాయింట్లు లభించనున్నాయి. అప్పుడు ఇంగ్లండ్-శ్రీలంక మ్యాచ్ ఫలితం బట్టి ఆసీస్ అవకాశాలుండనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను శ్రీలంక ఓడిస్తేనే ఆస్ట్రేలియా సెమీస్ చేరుతోంది. అలాకాకుండా ఇంగ్లండ్ విజయం సాధిస్తే మాత్రం మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆ జట్టే ముందడుగువేస్తోంది. ఈ క్రమంలోనే శనివారం జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను శ్రీలంక ఓడించాలని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇంగ్లండ్ విజయం సాధిస్తే గ్రూప్ 1 నుంచి రెండో జట్టుగా సెమీస్ బెర్త్ ఖారారు చేసుకుంటుంది.

అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 100 పరుగులతో విజయం సాధిస్తే ఇంగ్లండ్ 47 పరుగులతో గెలవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా 80 పరుగులతో గెలిస్తే ఇంగ్లండ్ 29 పరుగులతో గెలవాలి. అదే ఆస్ట్రేలియా 50 పరుగులతో గెలిస్తే ఇంగ్లండ్ ఒక్క పరుగుతో గెలిచినా సరిపోతుంది.

మరోవైపు గ్రూప్-1లో భారత్, సౌతాఫ్రికాకు సెమీస్ చేరే అవకాశాలు ఉండగా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా పోటీలో ఉన్నాయి. జింబాబ్వేపై భారత్, నెదర్లాండ్స్‌పై సౌతాఫ్రికా గెలిస్తే.. సెమీస్ బెర్త్‌లు ఖారారు చేసుకోనున్నాయి. అలా కాకుండా ఓడితే మాత్రం బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు అవకాశం ఉంటుంది.

Story first published: Friday, November 4, 2022, 14:13 [IST]
Other articles published on Nov 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+