Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022 ఛాంపియన్ ఇంగ్లండ్‌కు దక్కిన ప్రైజ్‌మనీ ఎంతంటే? టోర్నీ పోటుగాళ్లు ఎవరంటే?

Prize Money

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 ఛాంపియన్‌గా ఇంగ్లండ్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. షాన్ మసూద్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38), బాబర్ ఆజామ్(28 బంతుల్లో 2 ఫోర్లతో 32), షాదాబ్ ఖాన్(14 బంతుల్లో 2 ఫోర్లతో 20) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లకు తోడుగా.. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసారు. బెన్ స్టోక్స్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్‌(52 నాటౌట్)కు అండగా జోస్ బట్లర్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), మొయిన్ అలీ(12 బంతుల్లో 3 ఫోర్లతో 19) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, మహమ్మద్ వసీం తలో వికెట్ తీసారు. కీలక సమయంలో షాహిన్ షా అఫ్రిది గాయపడటం పాక్ విజయవకాశాలను దెబ్బతీసింది.

టీ20 ప్రపంచకప్‌ విజేత ఇంగ్లండ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో 1.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 13 కోట్ల రూపాయలు) లభించింది. అదే విధంగా అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్‌కు 8,00,000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 6.5 కోట్లు) దక్కింది. ఇక సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైన భారత్‌, న్యూజిలాండ్‌కు 4,00,000 డాలర్ల ( సుమారు రూ.3.25 కోట్లు) చొప్పున అందింది. అదే విధంగా సూపర్ 12 దశ నుంచి వైదొలిగిన 8 జట్లకు 70,000 డాలర్ల చొప్పున లభించింది.

అవార్డు విన్నర్స్..
ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ- పాకిస్థాన్

మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు- సికిందర్ రాజా

అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లీ

అత్యధిక వికెట్లు- వానిందు హసరంగ

అత్యధిక హాఫ్ సెంచరీలు- విరాట్ కోహ్లీ

బెస్ట్ యావరేజ్-విరాట్ కోహ్లీ

బెస్ట్ స్ట్రైక్‌రేట్- సూర్యకుమార్ యాదవ్

Story first published: Sunday, November 13, 2022, 21:32 [IST]
Other articles published on Nov 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+