T20 WC 2022: కొంపముంచిన కేఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర పరాజయం!

పెర్త్: టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. మెగా టోర్నీకి ముందు వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు 36 పరుగుల తేడాతో చిత్తయ్యింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(55 బంతుల్లో 74) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అతని నెమ్మదైన బ్యాటింగ్ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌కు జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సంచలన బ్యాటింగ్‌తో విజయాన్నందుకున్న టీమిండియా.. తాజా మ్యాచ్‌లో అతను లేకపోవడంతో ఓటమి చవిచూసింది.
బౌలర్లు రాణించినా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టులో నికోలసన్ హబ్సన్ ( 41బంతుల్లో 61), డీ ఆర్సీ షార్ట్ (38బంతుల్లో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 100 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(3/32) మూడు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్(2/27) రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది.
రాహుల్ ఒక్కడే..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవరల్లో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్ మినహా మరే బ్యాటర్ రాణించలేదు. రిషభ్ పంత్(11 బంతుల్లో 9) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. దీపక్ హుడా(6), హార్దిక్ పాండ్యా(17) కూడా నిరాశపరిచారు. ఫినిషర్ దినేశ్ కార్తీక్(10)తో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(2)సైతం చేతులెత్తేసాడు. అశ్విన్(2), భువనేశ్వర్ కుమార్(0) కూడా విఫలమయ్యారు.

కొంపముంచిన జిడ్డు బ్యాటింగ్..
పూర్తిగా ఆత్మరక్షణలో ఆడిన కేఎల్ రాహుల్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ధాటిగా ఆడలేకపోయాడు. అతని జిడ్డు బ్యాటింగ్ ఇతర బ్యాటర్లపై ఒత్తిడి నెలకొనేలా చేసింది. దాంతో భారీ షాట్లకు ప్రయత్నించిన భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. పవర్ ప్లేలో కేవలం 29 పరుగులు మాత్రమే చేసిన భారత్.. 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఆ తర్వాత మరిన్ని డాట్ బాల్స్ ఆడిన టీమిండియా చివరికి ఓటమిపాలైంది.

బరిలోకి దిగని కోహ్లీ..
ఈ జట్టులో రోహిత్ శర్మ ఉన్నా కూడా రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉన్నాడు. బ్యాటింగ్ చేయకపోయినా.. ఫీల్డింగ్ మాత్రం చేసాడు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. యుజ్వేంద్ర చాహల్ సైతం రెస్ట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో టీమిండియా తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 17, 18వ తేదీల్లో ఈ మ్యాచ్‌లు బ్రిస్బేన్ వేదికగా జరగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications