T20 World Cup 2022: పుచ్చకాయనా? పాకిస్థాన్ జెర్సీనా? నెట్టింట పేలుతున్న సెటైర్లు!

న్యూఢిల్లీ: వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం జట్లన్నీ కొత్త జెర్సీలతో సిద్దమవుతున్నాయి. ఇప్పటికే టీమిండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తమ కొత్త జెర్సీలను విడదల చేయగా.. తాజాగా పాకిస్థాన్ సైతం తమ నయా జెర్సీకి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే ఈ జెర్సీపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ ట్విటర్ లో విడుదల చేసిన వీడియోకు సంబంధించి నెటిజన్లు.. పీసీబీని ఓ ఆటాడుకుంటున్నారు. ఈ జెర్సీ ధరించే రెగ్యులర్ 'ఆకుపచ్చ' రంగులో ఉండి దాని మీద చారలతో కూడిన లైన్లు వచ్చాయి. ఇది చూడటానికి అచ్చం పుచ్చకాయ మాదిరే ఉంది.
పుచ్చకాయనా?జెర్సీనా?
దాంతో కొత్త జెర్సీని పుచ్చకాయతో పోలుస్తున్నారు. పుచ్చకాయకు పాకిస్థాన్ జెర్సీకి తేడా ఏమీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం ఈ జెర్సీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.'పాకిస్థాన్ లో పెరుగుతున్న కూరగాయలకు ఈ జెర్సీ సంకేతం'అని ఒకరంటే.. 'ఇదేంటి జెర్సీ అని పుచ్చకాయలను వేసుకున్నారా?'అని మరొకరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. 'ఒక్క పుచ్చకాయలేనా..? ఇంకేమైనా కూరగాయలు పెట్టారా..?', 'పాకిస్తాన్ లో పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు ఈ జెర్సీ సూచికనా..?'అని మరొకరు ప్రశ్నించారు. 'రండి బాబు రండి.. పుచ్చకాయ జెర్సీ.. వంద శాతం డిస్కౌంట్..'అని సెటైర్లు పేల్చుతున్నారు. సెంటర్ ఫ్రూట్ జెర్సీ.. థండర్ పుచ్చకాయ అనే ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
టీమిండియా జెర్సీ..
టీమిండియా మెన్స్, వుమెన్స్ క్రికెట్ జట్ల జెర్సీలను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. అయితే ఈ జెర్సీ టీ20లకు మాత్రమే వర్తించనుంది. గత కొన్ని రోజులుగా జెర్సీ ప్రమోషన్ విషయంలో ఎంపీఎల్ బ్రాండ్ చాలా హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు నుంచి ఇక నయా జెర్సీలో టీమిండియా కన్పించబోతుంది. ప్రస్తుతం ఉన్న జెర్సీ థిక్ బ్లూ రంగు కలిగి ఉండగా.. దీంతో పోలిస్తే కొత్త జెర్సీ కాస్త లైట్ బ్లూ రంగును కలిగి ఉంది. చేతులు, షోల్డర్ డార్క్ బ్లూ కలర్‌లో ఉండగా.. జెర్సీపై గీతలు వచ్చాయి.
జెర్సీపై మూడు నక్షత్రాలు ఎందుకంటే?..
ఈ కొత్త జెర్సీపై 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇవి మన ఇండియా టీం ప్రపంచ కప్ ను మూడుసార్లు గెలుచుకున్నందుకు చిహ్నాలు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ తొలి సీజన్‌లో, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో రెండోసారి, 2011లో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు మూడోసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో నాలుగోసారి ప్రపంచకప్ గెలవాలనే సంకల్పంతో టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది.

టీ20 వరల్డ్ కప్ జట్టు
టీ20 వరల్డ్ కప్ భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్
టీ20 వరల్డ్ కప్ పాకిస్థాన్ జట్టు:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అసిఫ్ అలీ, హరీస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నేన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీం షా, షాహీన్ షా అఫ్రిది, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications