T20 World Cup 2022: భారత్ ఓడిపోవాలని బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తున్న పాక్ ఫ్యాన్స్! (వీడియో)

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత్ ఓడిపోవాలని పాకిస్థాన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే తమ జట్టుకు సెమీస్ అవకాశాలుంటాయనే ఆశతో బంగ్లాదేశ్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన కొంత మంది పాక్ అభిమానులు.. తమ మద్దతు బంగ్లాదేశ్‌కేనని స్పష్టం చేశారు. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతున్న అడిలైడ్ మైదానానికి వచ్చిన ఇద్దరు పాకిస్థాన్ అమ్మాయిలు.. తాము బంగ్లాదేశ్ గెలవాలని కోరుకుంటున్నామని మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
తాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్‌కు మద్దతు..
సౌ
ఇక భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన గత మ్యాచ్‌లో పాకిస్థాన్ అభిమానులు టీమిండియా విజయాన్ని కోరుకున్నారు. సౌతాఫ్రికాపై భారత్ గెలిస్తే తమకు సెమీస్ అవకాశాలుంటాయని ఆ జట్టుతో పాటు అభిమానులు భావించారు. కానీ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలవ్వడంతో పాక్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. దాంతో టీమిండియా కావాలనే ఓడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జట్టు సెమీస్ రావద్దనే కుట్రలో భాగంగానే గెలిచే మ్యాచ్ భారత్ ఓటమిపాలైందన్నారు.

సంక్షిష్టంగా సెమీస్ సమీకరణం..
బంగ్లా, భారత్‌లపై వరుస విజయాలు సాధించిన సఫారీ జట్టు 5 పాయింట్లతోపాటు మెరుగైన రన్‌రేట్‌తో నంబర్ వన్‌గా నిలిచింది. భారత్ రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది. 4 పాయింట్లతో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉండగా.. జింబాబ్వే (3 పాయింట్లు), పాకిస్థాన్ (2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్‌పై సౌతాఫ్రికా విజయం సాధించడంతో నెదర్లాండ్స్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.

పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు ఏంటంటే..?
పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. తన చివరి రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై భారీ విజయాలు సాధించాలి. అంతే కాకుండా భారత్.. బంగ్లా చేతిలో ఓడి, జింబాబ్వేపై తక్కువ మార్జిన్‌తో గెలిస్తే... మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా పాక్ టాప్-4లో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికైతే పాక్ కంటే భారత్‌కు మెరుగైన నెట్ రన్‌రేట్ ఉంది. పాకిస్థాన్‌ను సౌతాఫ్రికా ఓడిస్తే చాలు.. దాయాది సెమీస్ రేసు నుంచి వైదొలిగినట్టే. నవంబర్ 3న దక్షిణాఫ్రికా, పాక్ మధ్య జరిగే మ్యాచ్ కీలకం కానుంది. అద్భుతం జరిగితే తప్పా.. పాక్ సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

నిలకడగా భారత్..
బంగ్లాతో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. అద్భుతంగా ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనా.. కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. దాంతో టీమిండియా 13 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీతో పాటు డేంజరస్ సూర్య ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. దీపక్ హుడా స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications