T20 World Cup 2022: భారత్ X సౌతాఫ్రికా మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు...!

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది. పేస్, బౌన్సీ పిచ్‌పై బ్యాటింగ్‌లో తడబడ్డ రోహిత్ సేన ఆదివారం 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది. టాప్ ఆర్డర్ తేలిపోవడంతో మొదట టీమ్‌ఇండియా 9 వికెట్లకు 133 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68) మినహా అంతా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(4/29) నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్(3/15) మూడు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఎయిడెన్ మార్క్‌రమ్(41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52), డేవిడ్ మిల్లర్(46 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అశ్విన్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.
పాక్ సెమీస్ అవకాశాలు గల్లంతు..
ఈ విజయంతో ఐదు పాయింట్లతో గ్రూప్-2లో భారత్‌ను వెనక్కి నెట్టి సౌతాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. టీమిండియా ఓటమితో పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకున్నారు. సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధించి ఉంటే సెమీఫైనల్ రేసులోకి పాక్ దూసుకొచ్చేది. భారత్ ఓడిపోవడంతో ఆ జట్టు అదృష్టాన్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ విజయం సాధిస్తుందని కలలు గన్న పాక్ అభిమానులకు ఊహించని ఫలితం ఎదురవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ సెమీస్ చేరవద్దనే ఉద్దేశంలోనే భారత్ కావాలనే ఈ మ్యాచ్ ఓడిపోయిందని కామెంట్ చేస్తున్నారు.
ఫిక్సింగ్ చేశారంటూ..
ఇక భారత్-పాక్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని కూడా ఆరోపిస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత టాప్-5 బ్యాటర్లు దారుణంగా విఫలమవ్వడం.. చేతిలోకి వచ్చిన సునాయస క్యాచ్‌లను నేలపాలు చేయడం, ఈజీ రనౌట్లను చేయలేకపోవడమే ఫిక్సింగ్‌కు సాక్ష్యాలని పేర్కొంటున్నారు. భారత్-సౌతాఫ్రికా మ్యాచ్‌ను చాలా ఆసక్తిగా గమనించిన పాక్ అభిమానులు.. భారత్ ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. పాక్‌ను అడ్డుకోవాలనే కుట్రతోనే భారత్ ఈ మ్యాచ్‌ను తేలికగా తీసుకుందని, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదని తెలిసి కూడా నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారని మండిపడుతున్నారు.
పాక్ సెమీస్ చేరాలంటే..
మూడు మ్యాచ్‌ల్లో ఒకటే విజయం సాధించిన పాకిస్థాన్ 2 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. రన్‌రేట్ కూడా మెరుగ్గా లేదు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. తన చివరి రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై భారీ విజయాలు సాధించాలి. అంతే కాకుండా భారత్.. బంగ్లా చేతిలో ఓడి, జింబాబ్వేపై తక్కువ మార్జిన్‌తో గెలిస్తే... మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా పాక్ టాప్-4లో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికైతే పాక్ కంటే భారత్‌కు మెరుగైన నెట్ రన్‌రేట్ ఉంది. పాకిస్థాన్‌ను సౌతాఫ్రికా ఓడిస్తే చాలు.. దాయాది సెమీస్ రేసు నుంచి వైదొలిగినట్టే. నవంబర్ 3న దక్షిణాఫ్రికా, పాక్ మధ్య జరిగే మ్యాచ్ కీలకం కానుంది. అద్భుతం జరిగితే తప్పా.. పాక్ సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications