T20 World Cup 2022: చెలరేగిన డారిల్ మిచెల్, కేన్ మామ.. పాక్ ముందు టఫ్ టార్గెట్!

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక సెమీస్‌లో న్యూజిలాండ్ 153 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. డారిల్ మిచెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(42 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసింది. కేన్, డారిల్ మిచెల్ కలిసి నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్ ఓ వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్‌పై పాకిస్థాన్ ఈ లక్ష్యాన్నిచేధించడం కష్టమైనే పనే.

శుభారంభం లేదు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. డేంజరస్ ఓపెనర్ ఫిన్ అలెన్(4) ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఔటయ్యాడు. షాహిన్ అఫ్రిది వేసిన మూడో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో తొలి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి డేవాన్ కాన్వే ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లు నిదానంగా ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ఇక క్రీజులో సెట్ అయిన డేవాన్ కాన్వే(21)ను షాదాబ్ ఖాన్ బుల్లెట్ త్రో రనౌట్‌గా పెవిలియన్ చేర్చడంతో కివీస్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 38 పరుగులు మాత్రమే చేసింది.

ఆదుకున్న కేన్ మామ..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేంజరస్ గ్లేన్ ఫిలిప్స్(6) మహమ్మద్ నవాజ్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో కివీస్ 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్‌తో కలిసి కేన్ మామ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మైదానానికి తగ్గట్లు క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలు చిక్కిన బంతులను బౌండరీలకు తరలించారు. షాహిన్ అఫ్రిది వేసిన 17వ ఓవర్‌లో కేన్ విలియమ్సన్(46) క్లీన్ బౌల్డ్ అవ్వడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

మిచెల్ హాఫ్ సెంచరీ..
క్రీజులోకి జేమ్స్ నీషమ్ రాగా.. డారిల్ మిచెల్ క్విక్ డబుల్స్‌తో స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. హారిస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్‌లో క్విక్ డబుల్‌తో మిచెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. చివరి ఓవర్‌లో బౌండరీ ఇవ్వకుండా కట్టడి చేసిన నసీమ్ షా 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో కివీస్ 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications