Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: పాపం సిరాజ్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచినా దక్కని చోటు!

T20 World Cup 2022: Mohammed Shami clears Fitness test, to replace Jasprit Bumrah

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు నిరాశే ఎదురైంది. వెన్ను గాయంతో చివరి నిమిషంలో దూరమైన ప్రధాన పేసర్ జస్‌‌ప్రీత్ బుమ్రాకు రీప్లెస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన సిరాజ్.. ప్రపంచకప్ జట్టులో అతని ప్రత్యామ్నాయంగా మాత్రం ఎంపిక కాలేకపోయాడు. వెన్నుగాయంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బుమ్రా దూరమవడంతో ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న మహమ్మద్ సిరాజ్‌ను టీమ్‌మేనేజ్‌మెంట్ హుటాహుటిన రప్పించింది. మరో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కరోనా బారిన పడటం సిరాజ్‌‌కు కలిసొచ్చింది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడిన సిరాజ్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు.

కరోనా బారిన పడిన మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ సాధించి రాణించడం కష్టమని, సిరాజ్‌కు మార్గం సుగుమమవుతుందని భావించారు. సిరాజ్ కూడా అద్భుత ప్రదర్శనతో బుమ్రాకు రిప్లేస్‌మెంట్‌గా తానే సరైనోడినని చాటి చెప్పాడు. అతనికి అడ్డుగా ఉన్న దీపక్ చాహర్ సైతం గాయపడటంతో అతనికి పోటీలేదనుకున్నారు. కానీ తాజాగా మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయడంతో సిరాజ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఎన్‌సీఏలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌ను షమీ క్లియర్ చేశాడని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ పేర్కొంది. దాంతో అతను బుమ్రా స్థానంలో జట్టుకు ఎంపికవ్వగా.. సిరాజ్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నాడు. ఎవరైన గాయపడితే అప్పుడు సిరాజ్‌కు ఆడే అవకాశం దక్కనుంది. బుధవారమే ఇతర రిజర్వ్ ప్లేయర్లతో కలిసి సిరాజ్ ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో సిరాజ్ మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. లక్నో మ్యాచ్‌లో(0/49) విఫలమైనా.. రాంచీ(3/38), ఢిల్లీ (2/17) వన్డేల్లో సత్తా చాటాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో పేస్‌తో పాటు స్వింగ్ ఉండటంతో ఆస్ట్రేలియా వికెట్లపై అతని బౌలింగ్ ప్రభావం చూపుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Story first published: Tuesday, October 11, 2022, 21:05 [IST]
Other articles published on Oct 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+