Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: తొండాట ఆడినా గెలవలేదు.. భారత్, పాక్ మధ్య తేడా ఇదే!

T20 World Cup 2022: Mohammad Wasim Jr left non-strikers end early to take advantage off last ball vs Zimbabwe

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్థాన్ వాటిని అందుకోలేకపోయింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. భారత్‌‌తో జరిగిన ఉత్కంఠ పోరులో చివరి బంతికి ఓడిన పాకిస్థాన్.. జింబాబ్వేపైన కూడా ఆఖరి బంతికి ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లో టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిన పాక్.. రెండో మ్యాచ్‌లో లక్ష్యాన్ని చేధించడంలో తడబడింది. జింబాబ్వేపై ఆరు బంతుల్లో పాకిస్థాన్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి 3, రెండో బంతికి 4, మూడో బంతికి ఒక పరుగు వచ్చాయి. మూడు బంతుల్లో 3 పరుగులు చేస్తే పాక్‌దే విజయం. నాలుగో బంతి డాట్ బాల్ కావడంతో.. ఐదో బంతికి మిడ్ ఆఫ్ మీదుగా భారీ షాట్‌కు యత్నించిన నవాజ్ క్యాచ్ ఔటయ్యాడు.

దాంతో పాక్ ఒత్తిడికి లోనైంది. చివరి బంతికి విజయానికి 3 పరుగులు అవసరం కావడంతో.. ఎలాగైనా 2 పరుగులు తీసి మ్యాచ్‌ను టైగా ముగించాలని పాక్ బ్యాటర్లు భావించారు. అందుకే షాహీద్ అఫ్రిదీకి బౌలర్ బంతిని వేయడానికి ముందే నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న మహ్మద్ వసీం జూనియర్ క్రీజ్ వదలి రెండు గజాల దూరం ముందుకు వెళ్లాడు. షాహీన్ షాట్ ఆడగానే వసీం వేగంగా పరుగు పూర్తి చేసి మరో రన్ కోసం వెనుదిరిగాడు. ఎలాంటి తడబాటుకు గురికానీ ఫీల్డర్ బంతిని స్ట్రయికర్ ఎండ్‌కు విసరడంతో.. షాహీన్ రనౌటయ్యాడు. ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ జింబాబ్వే సొంతమైంది.

ఆ మధ్య ఇంగ్లిష్ బ్యాటర్‌ను భారత క్రికెటర్ దీప్తి శర్మ మన్కడింగ్ ద్వారా రనౌట్ చేయగా.. పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆమె తీరును తప్పుబట్టారు. కానీ ఇప్పుడు మాత్రం విజయం కోసం పాక్ బ్యాటర్ క్రీజ్ వదిలి ముందుకు వెళ్లినా ఎవరూ నోరు మెదప లేదు. దాంతో భారత అభిమానులు వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే మన అశ్విన్ చేసి ఉండుంటే ఎన్ని అనే వారో చెప్పలేం.

పాకిస్థాన్ క్రికెటర్లు రన్ కోసం కక్కుర్తి పడినప్పటికీ.. అదే పాక్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మాత్రం చివరి బంతికి.. బౌలర్ బంతిని విసిరేంత వరకు క్రీజ్‌లోనే బ్యాట్ ఉంచాడు. లాస్ట్ బాల్ వైడ్ కాగా.. నవాజ్ మరోసారి బంతిని విసిరినప్పటికీ.. కోహ్లీ క్రీజ్‌లో ఉన్నాడు. క్రీడా నిబంధనలు పాటించిన భారత క్రికెటర్లు మ్యాచ్ గెలవగా.. విజయం కోసం దిగజారిన పాక్ మాత్రం ఓటమిపాలైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు చీటింగ్ అనేది భారత్ బ్లడ్‌లోనే లేదని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Friday, October 28, 2022, 20:56 [IST]
Other articles published on Oct 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+