T20 World Cup 2022: జట్టులో నుంచి తీసిపారేయండి నిరంజన్ గారూ.. కేఎల్ రాహుల్‌పై ఫ్యాన్స్ ఫైర్!

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్(5 బంతుల్లో 5) విఫలమయ్యాడు. క్రిస్ వోక్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. రాహుల్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతపై దెబ్బకొట్టిన వోక్స్ ఫలితం రాబట్టాడు.
ఈ ఓవర్ నాలుగో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌గా వేయగా.. రాహుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సరైన ఫుట్ వర్క్ లేకపోవడంతో పాటు బంతిని అంచనా వేయడంలో రాహుల్ విఫలమవడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ చేతిలో పడింది. దాంతో ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాకు సరైన శుభారంభం అందలేదు. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
ఐపీఎల్ ఆడుకోపో..
ఇక కేఎల్ రాహుల్ వైఫల్యంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక మ్యాచ్‌లో రాహుల్ విఫలమవుతాడని ముందే ఊహించామని కామెంట్ చేస్తున్నారు. అసలు రాహుల్‌ను అనవసరంగా జట్టులోకి తీసుకున్నారని, ఇతని ఆటకంటే బిల్డప్ ఎక్కువగా ఉంటుందని మండిపడుతున్నారు. ఐపీఎల్, చిన్న దేశాలపై తప్పా పెద్ద జట్లతో, కీలక మ్యాచ్‌ల్లో ఆడలేడని కామెంట్ చేస్తున్నారు. ఇతర బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చేందుకే అతను జట్టులో ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ గాంధీలానే..
రాహుల్ క్రీజులో ఉన్నంత సమయంలో మ్యాగీ చేసుకోవచ్చని సెటైర్లు పేల్చుతున్నారు. మ్యాథమెటిక్స్‌లో కేఎల్ రాహుల్ ఓ ప్రాబ్లమని, బయోలజీలో డాల్‌ఫిన్ అని, సైన్స్‌లో ఆటమ్ అని, చరిత్రలో మైత్, మూజిక్‌లో బీటీఎస్, పాలిటిక్స్‌లో రాహుల్ గాంధీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కేఎల్ రాహుల్‌కు తన బిడ్డనిస్తే కెరీర్ నాశనమయ్యేలా ఉందని అతని మామ బాధపడుతున్నాడని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
తీసిపారేయండి నిరంజన్ గారూ..
టీమిండియాలోనే బిగ్గెస్ట్ ఫ్రాడని, ప్రతిభ ఉన్నా.. ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ ట్వీట్స్‌తో రాహుల్ పేరు ట్రెండింగ్ అవుతోంది. కొందరైతే రాహుల్ గాంధీని జట్టులో నుంచి తీసేయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. పక్కకు దొబ్బేయండి నిరంజన్ గారూ అంటూ కామెంట్ చేస్తున్నారు. రాహుల్ వల్ల జట్టుకు ఉపయోగం ఏం లేదని కామెంట్ చేస్తున్నారు.
క్రీజులో కోహ్లీ, రోహిత్..
రాహుల్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం స్పిన్నర్లు బరిలోకి దిగడంతో బౌండరీలు బాదడంలో విరాట్, రోహిత్ తడబడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications