Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే బ్యాటింగ్ తీసుకున్నా: కేన్ విలియమ్సన్

T20 World Cup 2022: Kane Williamson reveals the reason why he opts to bat first against Pakistan

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఉపయోగించిన పిచ్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ తెలిపాడు. నాకౌట్ సమరంలో ఒత్తిడి కూడా ఉంటుందని, పాకిస్థాన్‌ చేజింగ్‌లో తడబడుతుందనే ఉద్దేశంతో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నట్లు వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పాడు.

పిచ్‌పై గ్రాస్ లేని కారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్పాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ప్రత్యర్థి జట్టులో కొంత మంది తెలియని వారున్నారని, అయినా తమ ప్రణాళికలు కట్టుబడి రాణిస్తే విజయం సాధించవచ్చని చెప్పాడు. గేమ్‌పైనే తమ ఫోకస్ ఉందని, తమ సాయశక్తుల విజయం కోసం పోరాడుతామని తెలిపాడు.

ఇక టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. పిచ్ నుంచి ఆరంభంలో లభించే అడ్వాంటేజ్‌ను వాడుకుంటామని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగిస్తామని తెలిపాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో తమకు పరాజయం ఎదురైనా.. తర్వాతి మూడు మ్యాచ్‌లో పాక్ అద్భుత ప్రదర్శన కనబర్చిందని చెప్పాడు. జట్టుగా ఈ మూమెంటమ్‌ను కొనసాగించేందుకు ఉత్సాహంగా ఉన్నామని తెలిపాడు. న్యూజిలాండ్‌లో క్వాలిటీ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ప్రశాంతంగా తమ ఆట తాము ఆడి విజయం కోసం శ్రమిస్తామని పేర్కొన్నాడు.

గత రికార్డులు పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. టాస్ గెలవడం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం. ఈ టోర్నీలో ఇక్కడ మొత్తం 5 మ్యాచ్‌లు జరగా.. ముందు బ్యాటింగ్ చేసిన జట్లే 4 సార్లు విజయం సాధించాయి.

తుది జట్లు:
పాకిస్థాన్: మహమ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజామ్, మహమ్మద్ హారీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీమ్ జూనియర్, నసీమ్ షా, హారిస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే(కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లేన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

Story first published: Wednesday, November 9, 2022, 13:28 [IST]
Other articles published on Nov 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+