T20 World Cup 2022 ఫైనల్‌కు ఇంగ్లండ్.. టీమిండియా కొంపముంచిన చెత్త బౌలింగ్!

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్-2లో సమష్టిగా విఫలమైన రోహిత్ సేన.. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తయ్యింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్(49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 నాటౌట్), అలెక్స్ హేల్స్(47 బంతుల్లో4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 86 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌కు కనీస పోరాటం కూడా చేయకుండా భారత ఆటగాళ్లు చేతులెత్తేసారు.
ముఖ్యంగా పేలవ బౌలింగ్‌తో కనీసం ఒక్క వికెట్ తీయలేకపోయారు. ఈ మెగా టోర్నీలోనే టీమిండియాకు ఇది అత్యంత ఘోర పరాజయం. జోస్ బట్లర్, హేల్స్ ధాటికి భారత బౌలర్లు పోటాపడీ పరుగులిచ్చుకున్నారు. మైదానంలో రోహిత్ ఎన్ని వ్యూహాలు పన్నినా ఈ జోడీని విడదీయలేకపోయాడు. దాంతో మరోసారి టీమిండియా టైటిల్ లేకుండానే ఇంటిదారిపట్టింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63), విరాట్ కోహ్లీ(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ హాఫ్ సెంచరీలతో 170 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించి చిరస్మరణీయ విజయాన్నందించారు. భారత బౌలర్లలో భువీ రెండు ఓవర్లలో 25 పరుగులివ్వగా.. అర్ష్‌దీప్ 2 ఓవర్లలో 15, అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 30, మహమ్మద్ షమీ 3 ఓవర్లలో 39, రవిచంద్రన్ అశ్విన్ 2 ఓవర్లలో 27, హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications