Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: భారత ఓటమిపై పాక్ ప్రధాని ఎటకారం.. ఇర్ఫాన్ పఠాన్ చురకలు!

T20 World Cup 2022: Irfan Pathan blasting Pakistan PMs sly tweet on Team India wins hearts

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో భారత జట్టు వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ పాకిస్థాన్ ప్రధాని చేసిన ఎటకారం ట్వీట్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. అనవసర విషయాలు మాట్లాడే బదులు దేశాన్ని బాగు చేయడంపై ఫోకస్ పెట్టాలని హితవు పలికాడు. టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దాంతో మరోసారి టైటిల్ లేకుండానే టీమిండియా వెనుదిరిగింది.

152/0 vs 170/0 అంటూ..

152/0 vs 170/0 అంటూ..

ఈ మ్యాచ్ తర్వాత పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది.'అయితే ఈ ఆదివారం... 152/0 వర్సెస్ 170/0 అన్నమాట...' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 151 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. దీంతో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచిన రెండు జట్ల మధ్య పోటీ అంటూ వ్యంగ్యంగా ఇలా ట్వీట్ చేశాడు షరీఫ్.

మీకు మాకు తేడా ఇదే..

మీకు మాకు తేడా ఇదే..

దీనికి భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. 'ఇదిగో ఇదే మీకూ మాకూ ఉన్న తేడా. మేం మా సంతోషాన్ని మా విజయంలో వెతుక్కుంటాం. కానీ మీరు ఎదుటివారి కష్టాల్లో వెతుక్కుంటారు. దీనికంటే ముందు నీ దేశాన్ని బాగుచేయడంపై శ్రద్ధ పెట్టు...' అంటూ హిందీలో ట్వీట్ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ రిప్లేపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మళ్లీ నోరు తెరవకుండా బదులిచ్చారని కొనియాడుతున్నారు.

రెండు మ్యాచ్‌ల్లో ఓడి..

రెండు మ్యాచ్‌ల్లో ఓడి..

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్థాన్‌పై ఆఖరి బంతికి ఉత్కంఠ విజయాన్ని అందుకున్న భారత జట్టు, గ్రూప్ స్టేజీలో ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుంది. టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది. ఇండియాతో మ్యాచ్‌లో ఓడిన తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి పాకిస్థాన్ ఓటమిపాలైంది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 128 పరుగులకి పరిమితమై ఘోర పరాజయాన్ని చవి చూసింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్‌కు వరుస విజయాలు దక్కాయి. నెదర్లాండ్స్, సౌతాఫ్రికాలపై విజయాలు అందుకున్న పాక్, కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ని ఓడించింది...

లక్కీగా సెమీస్..

లక్కీగా సెమీస్..

సూపర్ 12 రౌండ్‌లో జింబాబ్వేతో మ్యాచ్‌లో తప్ప మరో మ్యాచ్ గెలవని నెదర్లాండ్స్ జట్టు... ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. అప్పటి దాకా టీ20 వరల్డ్ కప్‌లో తమ ప్రయాణం ముగిసిందని, స్వదేశానికి వెళ్లడానికి బ్యాగులు కూడా సర్దిపెట్టుకున్న పాకిస్థాన్ జట్టు... ఒక్కసారిగా అదృష్టం ఈడ్చి పెట్టి దన్నడంతో వెళ్లి సెమీస్‌ బుట్టులో పడింది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు చెత్తాటతో ఏకంగా ఫైనల్‌కి వెళ్లి కూర్చుంది పాకిస్థాన్.

Story first published: Sunday, November 13, 2022, 16:58 [IST]
Other articles published on Nov 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+