T20 World Cup 2022: థియేటర్లలో క్రికెట్ మ్యాచ్‌లు.. ఐసీసీతో ఐనాక్స్ ఒప్పందం! టికెట్ ధర ఎంతంటే..?

హైదరాబాద్: అందరూ ఎదురు చూస్తున్న క్రికెట్ పండుగకు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రికెట్ పండుగా... కరోనా పుణ్యమా అంటూ ఏడాది వ్యవధిలోనే జరగుతోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం ఆయా జట్లు సన్నదమవుతున్నాయి. టీమిండియా అయితే ఆస్ట్రేలియాకు చేరి అక్కడి పరిస్థితులకు అలవాటు పడే ప్రయత్నం చేస్తోంది. 15 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న టీ20 ప్రపంచకప్‌ను ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న రోహిత్ సేన.. ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.

థియెటర్లలో క్రికెట్ సందడి..
క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఇక భారత్‌లో ఈ ఆటను మతంలా ఆరాధిస్తారు. అందుకే ప్రముఖ కంపెనీలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడతాయి. క్రికెట్ మ్యాచ్‌ల పేరిట ఆఫర్లు ప్రకటిస్తాయి. అధికారిక బ్రాడ్ కాస్టర్లు సైతం ప్రపంచకప్ మ్యాచ్ రైట్స్ కోసం కోట్లు కుమ్మరించాయి. ఇక ఈ క్రికెట్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ఐనాక్స్ ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లు కలిగివున్న ఐనాక్స్.. థియేటర్ బిగ్ స్క్రీన్లలో ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఐసీసీతో, ఐనాక్స్ ఒప్పందం కుదుర్చుకోనుంది.

74 నగరాల్లో
భారతదేశ వ్యాప్తంగా 25 ఐనాక్స్ థియేటర్లలో ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఐనాక్స్ లీజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ విశాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. "భారత క్రికెట్ ప్రేమికులకు పెద్ద స్క్రీన్‌పై క్రికెట్‌ను వీక్షించడం దాని సౌండ్ ఎఫెక్ట్‌లను భారీ స్థాయిలో అనుభవించడం వంటి ఆనందాన్ని అందించాలని ఐనాక్స్ నిర్ణయించింది. అలాగే ప్రపంచకప్ టోర్నీలో బిగ్ స్క్రీన్‌పై క్రికెట్ చూసే అవకాశం రావడంతో థియేటర్‌లో క్రికెట్‌ని ఆస్వాదించడం మరింత ఆనందాన్ని ఇస్తుంది' అని ఆయన తెలిపారు. భారత్‌లోని మొత్తం 74 నగరాల్లో ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియెటర్లు ఉన్నాయి.

టికెట్ ధర రూ.200 నుంచి 500..
బెంగళూరుతో సహా దేశవ్యాప్తంగా 74 నగరాల్లో ఐనాక్స్ 165 మల్టీప్లెక్స్‌లను కలిగి ఉంది. వాటిలో మొత్తం 705 స్క్రీన్‌లు కలిగి ఉన్నాయి. మొత్తం ఏకకాలంలో 1.57 లక్షల మంది ఈ క్రికెట్ మ్యాచ్ లను చూసే వీలుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఐనాక్స్ మరొక మల్టీప్లెక్స్ దిగ్గజం, PVR, ఒకదానితో ఒకటి విలీనాన్ని ప్రకటించాయి. ఇలా మ్యాచ్ లను థియేటర్ లో పెద్ద పెద్ద స్క్రీన్ పై చూస్తే.. క్రికెట్ మైదానంలో మ్యాచులను చూస్తున్న అనుభూతి కలుగుతుందని ఐనాక్స్ సంస్థ చెబుతోంది. మ్యాచ్ వీక్షించడానికి టికెట్ ధర.. నగరాన్ని బట్టి ఒకొక్క విధంగా ఉండవచ్చునని.. రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications