T20 World Cup 2022: సెమీఫైనల్ ముందు టీమిండియాను కలవరపెడుతున్న పాకిస్థాన్ 1992 సెంటిమెంట్!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 తుది దశకు చేరుకుంది. సూపర్ 12 స్టేజ్ ముగిసి నాకౌట్ సమరానికి తెరలేసింది. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్ చేరగా.. గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్ నాకౌట్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. టోర్నీ నుంచి నిష్క్రమించిదనుకున్న పాకిస్థాన్ అనూహ్యంగా సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది. పసికూన నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓటమిపాలవ్వడంతో దాయాదీ పాకిస్థాన్‌కు కలిసొచ్చింది. గ్రూప్-2 రన్నరప్‌గా ఆ జట్టు.. బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
సెంటిమెంట్లతో ఫ్యాన్స్ బిజీ..
మెగా టోర్నీ తుది దశకు చేరడంతో క్రికెట్ అభిమానులు, సెంటిమెంట్స్, గత రికార్డులను పరిశీలిస్తున్నారు. 2011 వన్డే ప్రపంచకప్ ఫలితాలు రిపీట్ అవ్వడం భారత అభిమానులను సంతోషపెడుతుంటే.. అవకాశమే లేని సందర్భం నుంచి అనూహ్యంగా సెమీఫైనల్‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్‌కు 1992 ప్రపంచకప్ పరిస్థితులు ఆశలు రేకెత్తిస్తున్నాయి. 1992 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి మరీ ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే ఆ టోర్నీ సెమీఫైనల్లో పాకిస్థాన్.. న్యూజిలాండ్‌ను ఓడించడం గమనార్హం.
సంతోషంలో పాక్ ఫ్యాన్స్..
1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియానే వేదికగా జరగడం, అప్పుడు కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీఫైనల్ చేరకుండా వెనుదిరగడం.. ఇప్పటిలానే ఆ టోర్నీ సెమీ ఫైనల్‌కు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాక్ చేరుకోవడం ఆ జట్టు అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ సారి కూడా ఆతిథ్య ఆస్ట్రేలియా నాకౌట్ చేరకుండానే వెనుదిరగడం, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీస్ చేరడం వంటి పరిస్థితులు చూస్తుంటే 1992 ప్రపంచకప్ రిపీట్ అవుతుందేమోననిపిస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
సెమీస్‌లో భారత్‌కు ఓటమి తప్పదా??
పైగా అప్పటిలానే సెమీస్‌లోనే న్యూజిలాండ్‌తో తలపడుతుండటం.. మరో సెమీస్‌లో ఇంగ్లండ్ జట్టు ఉండటంతో పాక్‌దే టైటిలని ఆ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు కూడా ఇంగ్లండ్ సెకండ్ సెమీఫైనల్లోనే సౌతాఫ్రికాతో తలపడి విజయం సాధించిందని, ఈ సారి కూడా సెకండ్ సెమీఫైనల్లో భారత్‌తో తలపడుతుందని కామెంట్ చేస్తున్నారు. భారత్‌పై ఇంగ్లండ్ గెలిచి ఫైనల్‌కు వస్తుందని, న్యూజిలాండ్ ఓడించి పాక్ టైటిల్ ఫైట్‌కు సిద్దమవుతుందని జోస్యం చెబుతున్నారు. ఈ లెక్కన సెమీఫైనల్లో భారత్‌కు ఓటమి తప్పేలా లేదని భారత అభిమానులు కూడా కలవరపడుతున్నారు.

2011 వన్డే ప్రపంచకప్ రిపీట్..
అయితే కొందరు ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం 2011 వన్డే వరల్డ్ కప్ రిపీట్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లోనూ టీమిండియా సౌతాఫ్రికా చేతిలో ఓడిందని, ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం నమోదు చేసిందని, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరకుండా ఇంటిదారిపట్టాయని, భారత్, న్యూజిలాండ్, పాక్ సెమీస్‌కు వచ్చాయని కామెంట్ చేస్తున్నారు. కాబట్టి 2011 వన్డే ప్రపంచకప్ రిపీట్ అయ్యి.. భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరీ 2011 ప్రపంచకప్? 1992 వన్డే వరల్డ్ కప్? ఏది రిపీట్ అవుతుందో చూడాలి!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications