5 పరుగుల తేడాతో
విధ్వంసకర బ్యాటింగ్‌తో తొలి 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 103 పరుగులు చేసిన ఆ జట్టు ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం ఆ జట్టు బౌలింగ్‌లో సత్తా చాటింది. వారి దెబ్బకు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ డకౌటవ్వగా.. అలెక్స్ హేల్స్, బేన్ స్టోక్స్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. దాంతో 15 ఓవర్ల ముగిసే సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి 93 పరుగులే చేసింది. ఈ సమయంలో వర్షంతో మ్యాచ్ నిలిచిపోవడంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు.
2011 వన్డే ప్రపంచకప్‌లోనూ..
ఐర్లాండ్ సంచలన విజయంతో టీమిండియా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు, ఐర్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడిందని, అప్పుడు భారత్ విశ్వవిజేతగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధించిన 328 పరుగుల భారీ టార్గెట్‌ను పసికూన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో ఛేదించి... టాప్ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది. ఇది జరిగిన 11 ఏళ్లకు మళ్లీ ఐర్లాండ్ చేతుల్లో ఇంగ్లండ్ ఓడిపోవడం.. భారత్‌కు సానకూల సంకేతమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
గ్రహాలు భారత్‌కు అనుకూలంగా..
ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే టీమిండియా 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ ముద్దాడుతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ సారి గ్రహాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని, రోహిత్ శర్మకు టైటిల్ యోగం ఉన్నాయని గోచరిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. 2011లో భారత్‌లో ఓరియో లాంఛ్ అయ్యిందని, అప్పుడు టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన 'బిస్కెట్' లాజిక్ కంటే... ఇంగ్లండ్, ఐర్లాండ్ సెంటిమెంట్ చాలా బెటరేనంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

ఇది మూడో సంచలనం..
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఈ ఫలితం మూడో సంచలనం. టూ టైం వరల్డ్ కప్ విన్నర్ వెస్టిండీస్ క్వాలిఫైయర్ రౌండ్ ఇంటిదారి పట్టగా.. తొలి మ్యాచ్‌లో 2014 వరల్డ్ కప్ విన్నర్ శ్రీలంక, నమీబియా చేతుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తాజాగా 2010 వరల్డ్ కప్ విన్నర్ అయిన ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది. టోర్నీ సాగుతున్నా కొద్దీ మరిన్నీ సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications
