T20 World Cup 2022: కోహ్లీ వల్ల కాలేదు.. రోహిత్ శర్మ అయినా ఆ గండాన్ని గట్టెక్కించేనా?

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 తుది దశకు చేరుకుంది. సూపర్ 12లో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆదివారం జరిగే ట్రిపుల్ హెడర్‌తో సూపర్12కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ జట్టు ఒకటే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో గ్రూప్ బీలో టేబుల్ టాపర్‌గా ఉన్న టీమిండియా ఆదివారం జింబాబ్వేపై గెలిస్తే.. గ్రూప్ బీ నుంచి టాప్ టీమ్‌గా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

సెమీస్‌లో ఆడకున్నా...
గ్రూప్ ఏ టాపర్ గ్రూప్ బీ నుంచి సెకండ్ ప్లేస్‌లో నిలిచిన జట్టుతో సెమీస్ ఆడనుంది. అలాగే గ్రూప్ బీ టాపర్ గ్రూప్ ఏలో సెకండ్ ప్లేస్‌లో నిలిచి టీమ్‌తో సెమీస్ ఆడనుంది. ఈ లెక్క ప్రకారం.. టీమిండియా న్యూజిలాండ్‌ను సెమీస్‌లో ఎదుర్కోదు. ఒకవేళ టీమిండియా జింబాబ్వేను ఓడిస్తే టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరుతోంది. అదే జరిగితే సెమీస్‌లో గ్రూప్-1 రన్నరప్‌గా నిలిచే ఇంగ్లండ్/ఆస్ట్రేలియాతో తలపడుతుంది. శనివారం ఇంగ్లండ్, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో ప్రత్యర్థి ఎవరో తేలనుంది. ఇంగ్లండ్‌కే అవకాశాలున్నాయి గనుక.. టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఆ జట్టే అనుకుందాం.

ఫైనల్లో పొంచి ఉన్న ముప్పు..
ఇదే జరిగితే టీమిండియా న్యూజిలాండ్ గండం తప్పుతుంది. ఇక్కడ కివీస్‌ను ఎదుర్కోవడం లేదని సంబరపడినా.. ఫైనల్లో ఆ జట్టుతో ముప్పు పొంచి ఉంది. టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్ చేరితో.. కివీస్ సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు రానుంది. సౌతాఫ్రికాకు సెమీఫైనల్ ఫోబియా ఉన్న నేపథ్యంలో కివీస్ ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే టీమిండియాకు పెద్ద గండం పొంచి ఉన్నట్లే. ఎందుకంటే.. సెమీస్ లాంటి నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియాకు న్యూజిలాండ్‌పై అంత మంచి రికార్డ్ లేదు.

న్యూజిలాండ్ చేతిలో ఓటమే..
ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్స్‌లో భారత్-న్యూజిలాండ్ మూడు సార్లు తలపడగా.. మూడు సార్లు కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది. 2007, 2016, 2021 వరల్డ్ కప్స్‌లో టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. అలాగే.. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్.. ఆ జట్టు చేతిలో ఖంగుతిన్నది. ఈ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా.. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడొద్దని భారత క్రికెట్ అభిమానులు కోరుకున్నారు.
సెమీస్‌లో ఆ జట్టును తప్పించుకున్నా.. ఫైనల్లో తలపడే అవకాశం ఉండటంతో ఆందోళనకు గురవుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. కివీస్ చేతిలో ఓడిందని, రోహిత్ ఆ రికార్డులను తిరగరాస్తాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

రోహిత్ తిరగ రాస్తాడా?
మాములుగా విరాట్ కోహ్లీ కంటే.. రోహిత్ శర్మకు లక్ ఎక్కువని, టీమిండియా ఫైనల్ చేరితో టైటిల్ గెలవడం ఖాయమంటున్నారు. కెప్టెన్ రోహిత్ ఇప్పటి వరకు ఒక్క ఫైనల్ కూడా ఓడలేదని గుర్తు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన ఘనత అతనిదని, ఆ అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుందని కామెంట్ చేస్తున్నారు. పైగా కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో విరాట్ టాస్ ఓడిపోయేవాడని, రోహిత్ మాత్రం టాస్ గెలుస్తాడని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా న్యూజిలాండ్ రూపంలో ఉన్న గండాన్ని ధాటితేనే టీమిండియా టీ20 ప్రపంచకప్ సొంతమవుతుందని కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications