IND vs PAK: మాటల యుద్దం షురూ.. 36 టీమ్ అంటూ టీమిండియాను హేళన చేసిన పాక్ నెటిజన్!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్ X పాకిస్థాన్ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు సన్నదమవుతున్నాయి. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నా.. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ఫీవర్ అప్పుడే మొదలైంది. ఇరు దేశాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దానికి కూడా తెర లేపారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ఓ పాక్ నెటిజన్ టీమిండియాను హేళన చేస్తూ ట్వీట్ చేయగా.. భారత జర్నలిస్ట్ ఒకరు దిమ్మతిరిగే బదులిచ్చి నోరు మూయించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
చిచ్చు రేపిన ఆ ట్వీట్ ఏంటంటే..?
పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ జట్ల మధ్య బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. గాయం కారణంగా పాక్ జట్టుకు దూరమైన షాహీన్ అఫ్రిది ఈ మ్యాచ్‌తో మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన షాహీన్.. తొలి ఓవర్ ఐదో బంతిని రాకాసి యార్కర్‌గా సంధించాడు. ఆ దెబ్బకు అఫ్గాన్ ఓపెనర్ గుర్భాజ్ కుప్పకూలాడు. అతని కాలి వేలికి బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిల్లాడాడు. దాంతో గుర్బాజ్‌ను భుజాలపై మోసుకొని తీసుకెళ్లారు.

152 ప్రాబ్లమ్స్ ఆఫ్ టీమ్ 36 ..
డానియల్ అలెగ్జాండర్ అనే నెటిజన్.. షాహీన్ యార్కర్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. టీమిండియా హేళన చేశాడు. షాహీన్ గుర్జాబ్‌కు విసిరిన బంతి ట్రైలర్ మాత్రమేనని, '152 ప్రాబ్లమ్స్ ఆఫ్ టీమ్ 36'కి అసలు మూవీ అక్టోబర్ 23న దీపావళి సందర్భంగా కనబడుతుంది' అంటూ ట్వీట్ చేశాడు. షాహీన్ గంటకు 152 కిలోమీటర్ల వేగంతో విసిరే బంతులకు 36 పరుగులకు ఆలౌటైన భారత్ (గతంలో ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లో) నుంచి సమాధానం ఉండదనే ఉద్దేశంతో అతను ఈ ట్వీట్ చేశాడు.

కోహ్లీతో దబిడి దిబిడే..
దీనికి హిమాన్షు పారిక్ అనే భారత స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అక్టోబర్ 21 నుంచి 24వ తేదీ మధ్య 2011 నుంచి కోహ్లీ చేసిన పరుగులను ప్రస్తావించాడు. 2011 అక్టోబర్ 23న ఇంగ్లాండ్‌పై 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ.. గత ఏడాది వరకు చూస్తే.. ఈ తేదీల్లో ఏకంగా ఐదు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదాడని పేర్కొన్నాడు. ఇక అక్టోబర్ 23న దబిడి దిబిడే అని వార్నింగ్ ఇస్తూ దిమ్మతిరిగే బదులిచ్చాడు. పాక్ అభిమానులు మాత్రం గతేడాది ఫలితమే రిపీట్ అవుతుందని కామెంట్ చేస్తుండగా.. అంత సీన్ లేదని భారత అభిమానులు అంటున్నారు. అయితే ఆదివారం జరిగే ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు వర్షం సూచన ఉంది. మ్యాచ్ సజావుగా జరిగే పరిస్థితులు కనబడటం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications