Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: సిడ్నీ నిర్వాహకులపై రోహిత్ సేన ఫైర్.. క్వాలిటీ లేని ఫుడ్‌తో లంచ్ బాయ్‌కట్!

T20 World Cup 2022: Indian cricketers boycott lunch due to cold and inadequate

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై సంచలన విజయంతో శుభారంభం చేసిన టీమిండియా.. నెదర్లాండ్‌తో తదుపరి పోరుకు సిద్దమైంది. గురువారం సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్దమవుతోంది. పాక్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే అక్కడి చేరుకున్న భారత ఆటగాళ్లు ఆ రోజు విశ్రాంతి అనంతరం ప్రాక్టీస్ ప్రారంభించారు. మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ ఉన్నప్పటికీ ఆటగాళ్లంతా నెట్స్‌లో శ్రమించారు. కోహ్లి, రోహిత్‌, రాహుల్‌, కార్తీక్‌, పంత్‌, హుడా దాదాపు 2 గంటల సెషన్‌లో పాల్గొన్నారు.

ప్రాక్టీస్ అనంతరం మైదానం వద్ద ఏర్పాటు చేసిన లంచ్‌ను భారత ఆటగాళ్లు బహిష్కరించారు. ఆహారం చల్లగా ఉందని, తమ అవసరానికి తగినట్లుగా లేదని నిర్వాహకులపై మండిపడ్డారు. తమకు ఇష్టమైన ఇండియన్ ఫుడ్‌కు బదులు సాండ్‌విచ్‌లు పెట్టారని ఆటగాళ్లు ఆరోపించారు. 'ఆహారం ప్రమాణాల మేర లేదు. ప్రాక్టీస్‌ సెషన్‌ అనంతరం సాండ్‌విచ్‌ తినలేం'' అని ఓ ఆటగాడు ప్రముఖ వార్త సంస్థ పీటీఐకి తెలిపాడు. ఇక టీమిండియా ఆటగాళ్లకు సరైన ఆహారం ఏర్పాటు చేయకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

క్రికెట్ ఆస్ట్రేలియా తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆస్ట్రేలియాలో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం ఇదే తొలి సారి. భారత జట్టు గత పర్యటనలో గబ్బా వేదికగా కూడా టీమిండియా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోంది.

ఇక నాణ్యమైన పేస్‌ను ఎదుర్కోవడంలో సరైన ఫుట్‌వర్క్‌ లోపించడమే కేఎల్‌ రాహుల్‌కు ఇప్పుడు పెద్ద సమస్య. ఈ నేపథ్యంలో సహాయ సిబ్బంది నిశిత పరిశీలనలో అతను సాధన చేశాడు. ప్రాక్టీస్‌ నుంచి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతినిచ్చారు. దాంతో నెదర్లాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్ దూరంగా ఉంటాడని ప్రచారం జరగ్గా.. అలాంటిదేం లేదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. నిన్నటి ప్రాక్టీస్ సెషన్‌లో పేసర్లకు విశ్రాంతినిచ్చారు. ఎలాంటి సాధన లేనందున తర్వాతి మ్యాచ్‌ రోజు ఫాస్ట్‌బౌలర్లు తాజాగా బరిలోకి దిగనున్నారు. బ్యాట్స్‌మన్‌ మాత్రం ముమ్మురంగా సాధన చేశారు.

Story first published: Wednesday, October 26, 2022, 8:13 [IST]
Other articles published on Oct 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+