T20 World Cup 2022: ఇంగ్లండ్‌పై ఇండియాకు తిరుగు లేదు.. యువీ చుక్కలు మర్చిపోలేరు! హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఇవే!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో అంచనాలకు తగ్గట్లు రాణించిన టీమిండియా.. టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. సూపర్12 దశలో సౌతాఫ్రికాతో మినహా అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన రోహిత్ సేన.. గ్రూప్-2 టాపర్‌గా సెమీఫైనల్ చేరింది. గురువారం జరగనున్న రెండో సెమీ ఫైనల్లో గ్రూప్-1 రన్నరప్ అయిన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక పోరులో విజయం సాధించి తమ జైత్రయాత్రను కొనసాగించాలని, 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది.

మెరుగైన రికార్డు..
ఇక ఇంగ్లండ్ కూడా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకే మెరుగైన రికార్డు ఉంది. ఈ ఫార్మాట్‌లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 22 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు విజయం సాధించింది. ఇంగ్లండ్ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు(2007, 2009, 2012) మూడు సార్లు మాత్రమే ఇరు జట్లు తలపడగా.. భారత్ రెండు సార్లు విజయాన్ని అందుకోగా.. ఇంగ్లండ్ ఒక్కసారి గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌ను ఎవరూ మరిచిపోరు.

యువీ 6 బంతుల్లో 6 సిక్స్‌లు...
ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు బాది వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. యువీ(16 బంతుల్లో3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 58) విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా... 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68), గౌతమ్ గంభీర్(41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 58) కూడా రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 200/6 స్కోర్‌కే పరిమితమై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

2009లో మాత్రం ఓటమి..
2009 టీ20 ప్రపంచకప్‌లో మాత్రం భారత్‌కు చుక్కెదురైంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు పరుగులతో గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేయగా.. భారత్ 150/5 పరిమితమై ఓటమిపాలైంది. ధోనీ(30 నాటౌట్), యూసుఫ్ పఠాన్(33 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.
ఇక 2012లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ 90 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్లకు 170 పరుగులు చేయగా.. అనంతరం ఇంగ్లండ్ 14.4 ఓవర్లలో 80 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(55 నాటౌట్)తో పాటు విరాట్ కోహ్లీ(40), గౌతమ్ గంభీర్(45) రాణించారు. హర్భజన్ సింగ్(4/12) నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు.

చివరి ఐదు మ్యాచ్‌ల్లోనూ..
చివరి ఐదు టీ20 మ్యాచ్‌ల్లో భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇంగ్లండ్ గడ్డపై మూడు టీ20ల సిరీస్‌ను 2-1 కైవసం చేసుకున్న భారత్.. గతేడాది సొంతగడ్డపై రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇరు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లీ ఇంగ్లండ్‌పై 589 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరర్ 80 పరుగులుగా ఉంది. ఇక చాహల్‌కు అత్యధిక వికెట్ల తీసిన ఘనత ఉంది. 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications